Thursday, May 2, 2024
- Advertisement -

అనుష్కకి సేవలు చేస్తున్న ప్రభాస్!

- Advertisement -

తెలుగు సినిమా స్థాయిని పెంచింది బాహుబలి చిత్రం. ఈ సినిమా ఎలాంటి రికార్డులు సాధించిందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. అయితే బాహుబలి సినిమాకి కొనసాగింపుగా బాహుబలి 2 సినిమా వస్తోంది. ఈ బాహుబలి 2 షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. ఈ సినిమా కోసం ప్రభాస్ చాలా కష్టపడుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ నగర శివార్లలోని ఓ క్వారీలో వేసిన పెద్ద గూడెం సెట్ లో జరుగుతోంది.

ఈ సెట్ లో ప్రభాస్, అనుష్కలపై కీలకమైన సీన్స్ చిత్రీకరిస్తున్నారు. దేవసేన అయిన అనుష్క గర్భవతి కావడంతో అమరేంద్ర బాహుబలి ఆమెకు సేవలు చేస్తున్నాడు. వేల మందితో సేవలు పొందాల్సిన రాజు గుడిసెలో సామాన్యుడిగా జీవిస్తుండడం గూడెం ప్రజల హృదయాలను పిండేస్తోంది. ఎంతో ఎమోషన్ తో సాగే ఈ సీన్లను డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి తన మార్క్ తో తీస్తున్నాడు.

ఈ సీన్స్ లో నిండు గర్భిణిగా అనుష్క నటన అద్భుతమని చిత్ర యూనిట్ చెబుతోంది. దేవసేన శివుడు కి ఈ గూడెంలోనే జన్మనివ్వనుంది. మరో రెండు రోజుల్లో ఆ సన్నివేశాల్ని కూడా షూట్ చేయనున్నారు. బాహుబలి మొదటి పార్ట్ లో డీ గ్లామర్ గా నటించిన అనుష్క ఈ సినిమాలో సౌందర్య రాశిగా కనువిందు చేయనుంది. ఇప్పటికే క్లైమాక్స్ పార్ట్ కంప్లీట్ చేశారు చిత్ర బృందం వచ్చేనెలకి షూటింగ్ పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Related

  1. అనుష్క ఎవరిని పెళ్లి చేసుకుంటుందో తెలుసా?
  2. అనుష్కను బాధపెడుతున్న తమన్నా
  3. అనుష్క నెం.1 స్థానం దక్కించుకుంది!
  4. హమ్మయ్య ప్రభాస్ కి కూడా బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఇచ్చారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -