Wednesday, May 15, 2024
- Advertisement -

సర్దార్ గబ్బర్ సింగ్ తొలి రివ్యూ!

- Advertisement -

సర్దార్ గబ్బర్ సింగ్…. తొలి రివ్యూ వచ్చేసింది. ఏకంగా 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఇంకా సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ కాలేదు, కనీసం బెనిఫిట్ షోలు కూడా పడలేదు… అప్పుడే సినిమా ఎవరు చూసారు? రేటింగ్ ఎలా ఇచ్చారు అని అనుకుంటున్నారా… ఈ రివ్యూ రాసింది ఉమైర్ సంధు. ఇండియన్ మేగజైన్ యూకె & యూఏఇ ఎడిటర్. యూకె సెన్సార్ బోర్డ్‌లో ఈయన సభ్యుడు కూడా. మిడిల్ ఈస్ట్, యూకెలలో ఇండియన్ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు.

యూకె సెన్సార్ బోర్డు ముందుకు సినిమా వచ్చినపుడు ఈయన కూడా సినిమా చూసారు. అనంతరం ట్వీట్ల రూపంలో తన రివ్యూ రాసారు. ఈయన సినిమా గురించి రాసిన రివ్యూ ట్వీట్స్ ఇపుడు ఫ్యాన్ సర్కిల్ లో హాట్ టాపిక్ అయింది. ఈ సినిమాకు ఆయన ఏకంగా 5 స్టార్ రేటింగ్ ఇవ్వడంతో అభిమానుల్లో అంచనాలు మరింత ఎక్కువయ్యాయి.

‘సర్దార్ గబ్బర్ సింగ్ పైసా వసూల్ మూవీ. పవన్ కళ్యాణ్ తన పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు. సింపుల్ గా చెప్పాలంటే ఇది వన్ మ్యాన్ షో. అవార్డులు కొల్లగొట్టే రేంజిలో పవన్ కళ్యాణ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. చాలా కాలం తర్వాత కాజల్ అగర్వాల్ అద్భుతంగా కనిపించింది. అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ తో ఆమె కెమిస్ట్రీ రాకింగ్. విలన్ గా శరద్ కేల్కర్ పెంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. డిఎస్పీ మ్యూజిక్ మైండ్ బ్లోయింగ్. సాంగ్స్ అన్నీ చార్ట్‌బర్టర్సే… సినిమా ఫస్టాఫ్ టెర్రిఫిక్ గా ఉంది. ప్రొడక్షన్ డిజైన్ చాలా క్లాస్ గా ఉంది. సింపుల్ స్టోరీ, స్క్రీన్ ప్లే, క్రిస్పీ ఎడిటింగ్, చప్పట్లు కొట్టే రేంజిలో డైలాగ్స్…ఉత్కంఠ పుట్టించే యాక్షన్ స్టంట్….స్ట్రాంగ్లీ రికమండెడ్ మూవీ. అందుకే 5 స్టార్ రేటింగ్ ఇస్తున్నాం’ అంటూ ఉమైర్ సంధు తన రివ్యూలో రాసారు.

అసలు రివ్యూలు రేపు ఉదయం బయటకు రానున్నాయి. సినిమా హిట్టా, ఫట్టా అనేది రేపు తేలిపోతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -