Saturday, May 4, 2024
- Advertisement -

సర్దార్ టికెట్టు ఐదు వేలు

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సెన్సేషన్ సర్దార్ గబ్బర్ సింగ్ జాతకం ఇవాళ తేలిపోతుంది, ఫస్ట్ లుక్ పోస్టర్ నుండి భారీ అంచనాలతో రికార్డులు క్రియేట్ చేసిన ఈ సినిమా ఈ మధ్యనే రిలీజ్ చేసిన థియేట్రికల్ ట్రైలర్ కి వచ్చిన నెగటివ్ రెస్పాన్స్ తో అందరూ షాక్ అయ్యారు, కానీ తరువాత స్టోరీ తెలిసినా స్క్రీన్ ప్లే తో అదరగొట్టబోతున్నారు అని తెలియడంతో సినిమాపై తిరిగి అంచనాలు పెంచుకున్నారు.

మరికొన్ని గంటల్లో ఓవర్సీస్ లో సినిమాకు అఫీషియల్ గా ప్రీమియర్ షోలు నిర్వహించబోతున్నారు, కాగా తెలుగునాట పవన్ క్రేజ్ దృశ్యా స్పెషల్ షోలకి 3000 వేల నుండి 5000 వరకు టికెట్ రేట్లు పలుకుండగా ఓవర్సీస్ లో డైరెక్ట్ గానే టికెట్ రేట్లు 2000 వేలతో మొదలుకాబోతుంది, అక్కడి లెక్కల్లో ఒక్కో టికెట్ 30$ నుండి 40$ వరకు ఉందట.

ఇది లాస్ట్ ఇయర్ బిగ్గెస్ట్ హిట్ బాహుబలి కన్నా ఎక్కువ రేటని చెబుతున్నారు, ఇంత రేటు పెట్టినా టికెట్స్ అన్నీ హాట్ కేకుల్లా అయిపోవడం నిజంగానే పవన్ క్రేజ్ మహిమే అని అంటున్నారు. సినిమాకు ఇప్పటివరకు ఎంత కావాలో అంతా చేసిన సర్దార్ గబ్బర్ సింగ్ టీం ఇప్పుడు సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే చాలు అని ఎదురుచూస్తుంది. మరి ఏం జరగబోతుందో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -