Sunday, May 12, 2024
- Advertisement -

అఖిల్ సినిమాపై 50 లక్షలకు దావా

- Advertisement -

అఖిల్ రెండ‌వ సినిమా హ‌లో విష‌యంలో నాగ్ చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ప్ప‌టీకి ఫలితం మాత్రం నిరాశే ఎదురైంది.విక్ర‌మ్ డైర‌క్ష‌న్‌లో హలో చిత్రాన్ని నాగ్ స్వ‌యంగా నిర్మించాడు. సినిమా రీలిజ్ విష‌యంలో ఈ సినిమా హాలివుడ్ రిమేక్ అనే వార్త‌లు హల్ చ‌ల్ చేశాయి.సినిమా రీలిజ్ అయ్యాక సినిమా హిట్ అని ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టిన ఎవ్వ‌రు ప‌ట్టించుకోలుదు. ఇప్పుడు ఈ సినిమా మ‌రో వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా రూపకర్తలు 50లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఉత్తరాదికి చెందిన ఒక వ్యక్తి కోర్టుకు ఎక్కాడు. ఈ మేరకు అతడు హలో మూవీ మేకర్లకు నోటీసులు కూడా పంపించినట్టుగా తెలుస్తోంది.

అసలు ఆ వ్యక్తికీ, హలో సినిమాకూ సంబంధం ఏమిటి? అంటే దాని వెనుక పెద్ద కథే ఉంది. ఈ సినిమాలో హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమ కథకు ఒక ఫోన్ నంబర్ ను వాడారు , ఆ నంబర్ ను ఉత్తరభారతదేశంలో ఒక వ్యక్తి వాడుతున్నాడట! ఇంకేముంది.. ఈ సినిమా వచ్చిన దగ్గర నుంచి ఆ నంబర్ ను పట్టుకుని అనేక మంది కాల్స్ చేయడం, మెసేజ్ లు చేయడం చేస్తున్నారట.వరస ఫోన్ కాల్స్ వల్ల తన ఉద్యోగం కూడా పోయింది అని.. తన జీవితం నాశనం అయ్యిందని అతడు అంటున్నాడు. అందుకే లాయర్ ద్వారా నోటీసులు పంపించానని 50లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని అతడు అంటున్నాడు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -