Thursday, May 16, 2024
- Advertisement -

ఎన్టీఆర్ తిరస్కరించిన సినిమాలు ఇవే

- Advertisement -

మరి తన జడ్జిమెంట్ విషయంలో ఎన్టీఆర్ ఒక పునరాలోచించుకోవాల్సిన సందర్భం ఇదేనేమో! ఎందుకంటే..ఆయన చేత తిరస్కరించబడిన సినిమాలు అన్నీ వేరే హీరోలతో రూపొంది సూపర్ హిట్స్ అవుతున్నాయి.

తాజాగా మహేశ్ బాబు “శ్రీమంతుడు” సినిమాతో సూపర్ హిట్‌ను నమోదు చేసిన నేపథ్యంలో ఎన్టీఆర్ జడ్జిమెంట్ మరోసారి చర్చనీయాంశం అయ్యింది.

 దర్శకుడు కొరటాల శివ ‘మిర్చి’ సినిమా తర్వాత ఎన్టీఆర్ కు ‘శ్రీమంతుడు’ సబ్జెక్ట్ ను వినిపించాడట. అయితే ఎన్టీఆర్ కు అది నచ్చలేదు. కొన్ని నెలలు గడిచిన తర్వాత ఎన్టీఆర్ శివ సబ్జెక్ట్ ను తిరస్కరించాడు. వేరే సినిమాతో బిజీ అయిపోయాడు. ఆ తర్వాత శివ అదే సబ్జెక్ట్ తో మహేశ్ ను మెప్పించడం.. ఇప్పుడు హిట్ ను కొట్టేయడం జరిగిపోయింది. మరి ఎన్టీఆర్ చేత తిరస్కరించబడిన సినిమా ఇదొక్కటే కాదు.

వెనుకటికి దిల్, ఆర్య, భద్రా, అతనొక్కడే, కిక్ , కృష్ణా.. ఈ సినిమాలు అన్నీ మొదటగా ఎన్టీఆర్ వద్దకే వచ్చాయట. అయితే అవేవీ ఎన్టీఆర్ ను మెప్పించలేకపోయాయి. దీంతో ఆ దర్శక నిర్మాతలు మరో హీరోతో ఆ సినిమాలు రూపొందించారు. అవన్నీ కూడా సంచలన విజయాలు సాధించాయి. మరి శ్రీమంతుడు సినిమాతో మళ్లీ పాత సినిమాలను గుర్తు చేసుకోవాల్సి వస్తోంది. మరి ఇప్పుడు ఈ సినిమాల విషయంలో మిస్ జడ్జిమెంట్ గురించి ఎన్టీఆర్ ఏమనుకొంటున్నాడో!

 

Also Read:

పవన్, ఎన్టీఆర్ తలపడతారా… మరి గెలిచేదెవ్వరో! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -