Saturday, May 4, 2024
- Advertisement -

షాకిచ్చిన స్టార్ హీరోలు … సినిమాలు క్యాన్సిల్‌!

- Advertisement -

టాలీవుడ్ నుంచి బాలీవ‌డ్ వ‌ర‌కు మొత్తం మీటూ చూట్టునే తిరుగుంది.ఆడ‌వాళ్లు జ‌రిగిన లైంగిక వేధింపుల గురించి బ‌హిరంగంగా చెప్ప‌డ‌మే ఈ మీటూ.లైంగిక వేధింపులు ఎదుర్కొన్న నటీమణులు వారికి జరిగిన అన్యాయాన్ని బహిరంగంగా చెప్పేస్తున్నారు. అది ఎంతవరకు నిజం అని కొన్ని ప్రశ్నలు వస్తున్నప్పటికీ స్టార్ హీరోలు మాత్రం అలాంటి వారితో వర్క్ చేయడానికి ఇష్టపడటం లేదు. మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సుభాష్ కపూర్ పై ఇటీవల లైంగికపరమైన ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. గీతికా త్యాగి అతని చెంప చెళ్లుమనిపించిన వీడియో వైరల్ అవుతూనే ఉంది.

అయితే త్వరలో అతను అమీర్ ఖాన్ తో `మొఘల్` అనే సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడు. ఇప్పుడు ఈ సంగతి తెలియడంతో అమిర్ ఖాన్ సినిమాను క్యాన్సిల్ చేసుకున్నాడు.అక్షయ్ కుమార్ కూడా తాను చేయబోయే సినిమా క్యాన్సిల్ చేసుకున్నాడు. అక్షయ్ సాజిద్ ఖాన్ తో హౌస్ ఫుల్ 4 ప్రాజెక్ట్ కి ఒకే చేశాడు. అయితే ఇప్పుడు ఆ దర్శకుడిపై ఆరోపణలు రావడంతో నిర్మాతకు ఫోన్ చేసి చెప్పేశాడు. ఇలా ఇద్ద‌రు స్టార్ హీరోలు త‌మ సినిమాను క్యాన్సిల్ చేసుకోవ‌డం సంచ‌ల‌నంగా మారింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -