- Advertisement -

వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీకీ ఎన్ని సీట్లంటే…?

- Advertisement -

వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అధికార పీఠంకోసం వైసీపీ, టీడీపీలు కుస్తీ పుడుతున్నాయి. ఈ సారి అధికారంలోకి రావాల‌ని వైఎస్ జ‌గ‌న్ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.అందులో భాగంగానే ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర ప్రారంభించారు. ఈ యాత్ర ద్వారా ప్ర‌త్య‌క్షంగా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకొని వారి స‌మ‌స్య‌లను తెలుసుకుంటున్నారు. ఇక టీడీపీ కూడా మ‌రో సారి అధికారం కోసం గ‌ట్టిగా నే ప్ర‌య‌త్నం చేస్తోంది.

వైసీపీ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా ప్ర‌శాంత్ కిషోర్‌ను నియ‌మించిన సంగ‌తి తెల‌సిందే. ఇప్ప‌టికే అనేక స‌ర్వేలు వైసీపీదే అధికారం అని తేల్చి చెప్పాయి. సీ ఓట‌ర్ స‌ర్వేలో జ‌గ‌న్ 21 ఎంపీ సీట్లు వ‌స్తాయ‌ని తేలింది. అయితే జ‌గ‌న్‌కు వ‌చ్చే సీట్ల‌ను త‌గ్గించాల‌ని టీడీపీ విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

ఇప్ప‌టికే పీకే టీం చేసిన ఫైన‌ల్ స‌ర్వే జ‌గ‌న్‌కు చేరిందంట‌. త్వ‌ర‌లోనే ఆ స‌ర్వే ఆధారంగానే నాయ‌కుల‌కు టికెట్లు కేటాయించ‌నున్నారు. గ‌తంలో పీకే స‌ర్వేలో దాదాపు 100కు పైగానే సీట్లను వైసీపీ గెలుచుకుంటంద‌నేది తెలిసిందే. అయితే మ‌రో సారి జ‌గ‌న్ పీకేతో ర‌హ‌స్య స‌ర్వే చేయించారంట‌. ఈ స‌ర్వేలో ఎన్ని సీట్లు గెలుస్తామో పార్టీ నేత‌ల‌కు జ‌గ‌న్ స్ప‌ష్ట‌త ఇవ్వ‌నున్నార‌ని పార్టీ వ‌ర్గాల నుంచి వ‌స్తున్న స‌మాచారం. ఎవ‌రు ఏ సెగ్మెంట్‌లో గెలుస్తార‌నేది ప్ర‌స్త‌తానికి స‌స్పెన్స్‌. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నిసెగ్మెంట్లు గెలుస్తారో అనేది తెలియ‌జేస్తారంట‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -