Sunday, May 5, 2024
- Advertisement -

పాత్ర కోసం ఎంత దూరమైనా..

- Advertisement -

సినిమాను, పాత్రను బలంగా నమ్మిన నటుడు.. ఆ సినిమా కోసం, పాత్ర కోసం ఎంత దూరమైనా వెళతాడన్న సత్యాన్ని అమీర్ ఖాన్ మళ్లీ ఋజువు చేశాడు.

వినూత్న కథాంశాలతో, ప్రయోగాలతో, తాను నమ్మిన సినిమా కోసం ఎంతటి కష్టానికైనా వెనుకాడని నటుడిగా సినీపరిశ్రమలో ఓ మంచి  పేరు తెచ్చుకున్న అమీర్.. తాజాగా మరో సరికొత్త ప్రయోగానికి తెరతీశాడు.

రాజూ హిరాణి దర్శకత్వం వహిస్తుండగా, అమీర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘పీకే’. 3 ఇడియట్స్ తర్వాత వీరిద్దరి కలయికలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో ఓ ప్రత్యేక సన్నివేశం కోసం అమీర్ నగ్నంగా నటించిన వార్త తెలిసిందే. తాజాగా ఆ సన్నివేశానికి సంబంధించిన ఫోటోను ఫస్ట్‌లుక్‌గా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో రైలు పట్టాలపై కేవలం ఒక పాత టేప్ రికార్డర్‌ను మాత్రమే అడ్డుగా పెట్టుకొని నిలబడి ఉన్న అమీర్‌ఖాన్‌ని చూడొచ్చు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ సెన్సేషన్.

‘సినిమా అనేది ఆలోచింపజేసే కథాంశాల్ని చెప్పడానికి ఒక వేదిక’ అని బలంగా నమ్మి సినిమాలను తీసే దర్శకుడు రాజూ హిరాణి. ఎవ్వరూ చెప్పడానికి కూడా సాహసించని కథాంశల్ని సున్నితంగా, వినోదబరితంగా చెప్తూ ఆలోచింపజేసే విధంగా తెరకెక్కించే ఆయన పీకేను కూడా అలాగే రూపొందిస్తున్నారు. కచ్చితంగా ఏదైనా బలమైన సన్నివేశం కోసమే అమీర్ ఖాన్ నగ్నంగా నటించాల్సిన ఈ సన్నివేశాన్ని తయారు చేసుంటారనేది సినీ పండితుల అభిప్రాయం. రిలీజ్‌కు ముందే ఇంత పాసిటివ్ వైబ్రేషన్‌తో కనిపిస్తున్న ఈ చిత్రం రిలీజ్ తర్వాత ఇంకెన్ని సంచలనాల్ని సృష్టిస్తుందో తెలియాలంటే డిసెంబర్ 19 వరకు ఆగాల్సిందే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -