Monday, May 13, 2024
- Advertisement -

అభివృద్దిలో పోటీపడే దమ్ముందా?- కెసిఆర్

- Advertisement -

హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ప్రొ. జయశంకర్ విశ్వవిద్యాలయంగా నామకరణం చేస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ప్రొ.జయశంకర్ జయంతి సందర్బంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆయన విగ్రహాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు.

అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ… ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిదానిని వివాదం చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు.మీ బతుకు మీరు బతకండి..మా బతుకు మేం బతుకుతాం అని అన్నారు కెసిఆర్. ఎన్.జి.రంగా యూనివర్శిటీ పదో షెడ్యూల్ లో ఉందని, దానికి అనుగుణంగానే పేరు మార్చామని,ఇందులో పదిహేను శాతం సీట్లు వారికి వస్తాయని,వారికి పీజులు ఎపి ప్రభుత్వం చెల్లించవచ్చని అన్నారు.దమ్ముంటే అభివృద్దిలో పోటీపడాలని చంద్రబాబు నాయుడుకు ఆయన సవాల్ చేశారు. లక్షన్నర కోట్లతో సింగపూర్ కట్టుకుంటారు కాని,పిల్లల చదువులకు డబ్బులు పెట్టలేరా అని ఆయన అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -