Thursday, May 9, 2024
- Advertisement -

యాడ్స్ విషయంలో అత్యధిక డబ్బు ఆయనకే!

- Advertisement -

డజనుకు పైగా కంపెనీలకు.. బ్రాండ్లకు అంబాసిడర్ గా ఉంటూ కోట్ల రూపాయలు సంపాదించడం వేరు. సెలెక్టివ్ గా కొన్ని కంపెనీలకు మాత్రమే అంబాసిడర్ గా ఉంటూ సంపాదించడం వేరు.

ఈ రెండు రకాల్లో రెండో బాటను ఎంచుకొన్నాడు బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్. ఈ మధ్య ఈ మిస్టర్ పర్ఫెక్షనిస్టు స్నాప్ డీల్ కంపెనీకు బ్రాండ్ అంబాసిడర్ గా కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఇ కామర్స్ వెబ్ సైట్ అయిన స్నాప్ డీల్ కు ఆమిర్ అంబాసిడర్ గాఉన్నాడు. ఆ సైట్ యాడ్ లో కనిపిస్తున్నాడు.

మరి దీని గానూ ఆమిర్ కు భారీ పారితోషకమే ముట్టినట్టుగాతెలుస్తోంది. అది ఏకంగా 15 నుంచి 20 కోట్ల రూపాయలు అని టాక్ . ఒప్పందం ప్రకారం ఒక ఏడాదికి గానూ ఆమిర్ కు ఈ డబ్బు అందుతుందని తెలుస్తోంది. వాస్తవంగా ఆమిర్ పెద్దగా యాడ్ ఫిలిమ్స్ లో కనిపించడు. టైటన్ తరహా కొన్ని కంపెనీలకు మాత్రం అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇలా అరుదుగా యాడ్స్ లో చేయడం కూడా ఆమిర్ బ్రాండ్ కు విలువ పెంచినట్టుగా ఉంది! 

షారూక్ నుంచి మహేశ్ బాబు వరకూ మంచి ఇమేజ్ ఉన్న తారలు అనేక బ్రాండ్లకు అంబాసిడర్లుగా ఉన్నారు. వాళ్లకూ బాగానే సొమ్ములు ముడుతున్నాయి. అయితే ఆమిర్ తక్కువ కంపెనీలనే ప్రమోట్ చేస్తున్నాడు కాబట్టి.. ఈయనకు విలువ మరింత ఎక్కువ! 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -