Sunday, May 5, 2024
- Advertisement -

యూపీఏకు సీక్వెల్ సినిమా ఎన్డీయే!

- Advertisement -

ఏ విషయాల్లో అయితే మోడీ బెటర్ మెంట్ ను చూపుతాడని జనాలు అనుకొన్నారో.. అవే విషయాల్లో ఆయన విఫలం అవుతున్నాడు. ఆర్భాటపు మాటలు, విదేశీ పర్యటనలూ వంటి వాటిని పక్కనపెడితే..

నరేంద్రమోడీ సర్కారు ముఖ్యమైన అంశాల్లో కాంగ్రెస్ కొనసాగింపులా కనిపిస్తోంది. ఇప్పటికే వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎఫ్ డీఐల పెట్టుబడులకు అవకాశాలను పెంచుకొంటూ పోతూ కమలనాథులు ప్రైవేటీకరణను వేగవంతం చేశారు. కాంగ్రెస్ వాళ్లు ప్రైవేటీకరణకు కిటికీలు తెరిస్తే  మోడీ గవర్నమెంటు తలుపులు తెరస్తోంది! 

 

ఇక జమ్మూ కాశ్మీర్ వంటి సున్నితమైన అంశాల్లో కూడా మోడీ ప్రభుత్వం ప్రజల మన్ననలు పొందలేకపోయింది. ఏకంగా ఉగ్రవాదులే విడుదలైపోతున్నారు బీజేపీ- పీడీపీ భాగస్వామ్య పాలనలో! సరిహద్దులో పాక్ దాష్టికాలు కూడా ఏం తగ్గలేదు. మోడీప్రధాని అయితే పాక్ కు గట్టిగా సమాధానం చెబుతాడని చాలా మంది ఆశించారు. మరి వాటి విషయంలోనే కాదు.. ఇంకా చాలా అంశాల్లో కూడా మోడీసర్కారు మన్మోహన్ సర్కారుకు కొనసాగింపు అనిపిస్తోంది! తాఋగా ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా బదిలీ వేటుతో మరోసారి అదినిరూపితమైంది. 

 

రాబర్ట్ వాద్రా- డీఎల్ఎఫ్ డీల్ ను రద్దు చేయడం ద్వారా అశోక్ ఖేమ్కా వార్తల్లోకి వచ్చాడు.. అప్పట్లో హర్యానాలో.. కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించడం ద్వారా ఆయన సంచలనం సృష్టించాడు. ఆయనపై వెంటనేబదిలీ వేటు పడటంతో అది మరో సంచలనం అయ్యింది. అప్పట్లో కమలం పార్టీ వారు అశోక్ ఖేమ్కాకు అండగా నిలబడ్దారు. అయితే ఇప్పుడు మాత్రం వారే ఆయనను దగ్గరుండి మరో బదిలీ చేయించారు! 

 

నిన్నటి వరకూ హర్యానాలో ట్రాన్స్ పోర్ట్్ కమిషనర్ గా పనిచేసిన ఈ నిజాయితీ పరుడైన అధికారిని ఆర్కియాలజీ మ్యూజియం శాఖకు పంపించి మూల కూర్చోబెట్టారు.ఎందుకలా.. అంటే బీజేపీనేత, రవాణా శాఖ మంత్రి కి అశోక్ నచ్చలేదట. దీంతో బదిలీ వేటు వేసినట్టుగా తెలుస్తోంది! అయితే బీజేపీ ప్రభుత్వం దీన్ని సమర్థించుకొంటోంది. ఇదంతా రొటీన్ గా జరిగిందేనని అంటోంది.  అప్పట్లో కాంగ్రెస్ వాళ్లు కూడా ఇలాగే సమర్థించుకొన్నారు కదా! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -