Saturday, May 11, 2024
- Advertisement -

ఐశ‌ర్య‌రాయ్‌తో ల‌వ్‌స్టోరీ చెప్పిన అభిషేక్‌

- Advertisement -

బాలీవుడ్‌లో మోస్ట్ వాటెండ్ క‌పుల్స్ అంటే అంద‌రు ఠ‌క్కున ఐశ‌ర్య‌- అభిషేక్ పేర్లు చెబుతారు. అభిషేక్ బచ్చన్ – ఐశ్వర్యా రాయ్‌కి సంబందించిన వార్త వారానికోటి నిత్యం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతూనే ఉంటాయి. వారిపై ఎన్ని గాసిప్స్ వ‌చ్చిన వాటిని అస్స‌లు ప‌ట్టించుకోరు ఈ జంట‌. ఇటీవ‌లే అభిషేక్ బ‌చ్చ‌న్ ఇండియా టుడే కాన్‌క్లేవ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఐశ్వ‌ర్య‌తో త‌మ ప్రేమ వ్య‌వ‌హారం గురించి చెప్పుకొచ్చాడు. ఐశ్వర్యతో నా కెరీర్ మొదట్లోనే పెద్దగా గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేయాల్సి వచ్చింది. మా ఇద్దరి మొదటి చిత్రం ‘ధాయి అక్షర్‌ ప్రేమ్‌కే’.

అప్పుడు మా మధ్య స్నేహం ఏర్పడింది. ‘కుచ్‌ న కహో’ సినిమా స్నేహాన్ని మరింత బలపరిచింది. ఇక ‘ఉమ్రా జాన్‌’ సినిమాతో స్నేహం ప్రేమగా మారింది. ముందుగా నేనే ప్రపోజ్ చేశాను. పెళ్లి చేసుకున్నాం. ఆరాధ్య జన్మించిన అనంతరం మా లైఫ్ ని కొత్తగా స్టార్ట్ చేసింది అంటూ ఐశ్వర్య ఒక తల్లిగా నటిగా తన పనికి అంకితమవుతోందని చెప్పాడు. అదే విధంగా తన భార్య ఒక సూపర్ ఉమెన్ అంటూ అభిషేక్ వర్ణించాడు. ఐశ్వర్య రాయ్ సినిమాల‌తో బిజీగా ఉండ‌గా ,అభిషేక్ మాత్రం బిజినెస్ న‌డుపుతున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -