జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తనకు ఇష్టమైన ఇద్దరు పోరాట యోధుల గురించి వెల్లడించారు. వారిద్దరూ కలసి ఉన్న అపూర్వ చిత్రం లండన్ లో తనకు దొరికిందని చెబుతూ, పవన్ కల్యాణ్ ఓ అపురూప చిత్రాన్ని తన ట్విట్టర్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నారు.
బుధవారం ట్విట్టర్‌లో తను అభిమానంచే ఇద్దరు హీరోల పోటోలను పోస్ట్ చేశారు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, పెరియార్‌ల ఫోటోలను పోస్ట్ చేశారు. తనకు ఇష్టమైన ఇద్దరు వారియర్స్ వీరే అంటూ ఆ ఫోటోలు పెట్టారు.డాక్టర్ బీఆర్ అంబేద్కర్, పెరియార్ రామస్వామి నాయకర్ లు కలిసి కూర్చుని సరదాగా ముచ్చటించుకుంటున్న ఈ చిత్రం తనకు లండన్ లోని అంబేద్కర్ హస్ లో కనిపించగా, దాని కాపీని తీసుకున్నానని చెప్పారు.
వీరిద్దరూ సమాజంలో అసమానతలను తొలగించాలన్న ఉద్దేశంతో తమ తుది శ్వాస వరకూ పోరాడారని కొనియాడారు. వీరిద్దరూ తన ఫేవరెట్ పోరాట యోధులని చెప్పాడు. పవన్ ట్వీట్ చేసిన ఫోటోను మీరూ చూడవచ్చు.
తొలి ఫోటోను పెరియార్, అంబేడ్కర్‌లు కలిసి సరదాగా నవ్వుతూ ఉన్న ఫోటోను పెట్టిన పవన్.. ఆ తర్వాత తాను ఆ ఫోటోను చూస్తున్న ఇమేజ్‌ని పోస్ట్ చేసారు. వారిద్దరు సరదాగా నవ్వుతున్న ఫోటోను పవన్ కళ్యాణ్ తీక్షణంగా చూస్తూ అందులో ఉన్నారు.
Two of my favourite Warriors Sri Ambedkar & Sri Periyar who fought against social inequality & who stood firmly for social justice, till their last breath.
(Photo taken by me in Ambedkar’s house,London) pic.twitter.com/0TQatIRwQs— Pawan Kalyan (@PawanKalyan) December 6, 2017
