- Advertisement -

‘ఆచార్య’ తో కలిసి వచ్చిన సిద్దా.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!

- Advertisement -

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ హీరోలకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. పునాదిరాళ్లు చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి స్వయంకృషితో పైకి వచ్చారు. ఆయన నట వారసులుగా ఇప్పటికే పలువురు హీరోలు వెండితెరపై జోష్ కొనసాగిస్తున్నారు. చిరుత చిత్రంతో చిరంజీవి తనయుడు రామ్ చరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి.. మగధీరతో బాక్సాఫీస్ షేక్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరెక్ట్ చేస్తోన్న మూవీ ఆచార్య.

ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథను మలుపు తిప్పే సిద్ధ అనే స్టూడెంట్ లీడర్ పాత్రలో కనిపించనున్నాడు. తండ్రి తనయులైన చిరంజీవి, రామ్ చరణ్ పూర్తి స్థాయి  హీరోలుగా నటిస్తోన్న ఫస్ట్ మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.  నేడు రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ‘ఆచార్య’ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు.

ఈ లుక్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాత్రపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే చెర్రీ బర్త్ డే సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ మూవీ టీమ్ అల్లూరి సీతారామరాజుగా చరణ్ లుక్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో తొలిసారి పూర్తి స్థాయిలో తండ్రీ కొడుకులైన చిరంజీవి, రామ్ చరణ్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతుండంపై మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -