Thursday, March 28, 2024
- Advertisement -

పుణెలో భారీ అగ్నిప్రమాదం.. 448 షాపులు దగ్దం

- Advertisement -

మ‌హారాష్ట్ర పూణే న‌గ‌రంలోని ప్రఖ్యాత ఫ్యాషన్ స్ట్రీట్ మార్కెట్ లో శుక్రవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో భారీ స్థాయిలో ఆస్తి న‌ష్టం సంభ‌వించింది. దాద‌పు 448 దుకాణాలు బుగ్గిపాలు అయ్యాయి. భారీ స్థాయిలో మంట‌లు చెల‌రేగ‌డంతో కంటోన్మెంట్ ఫైర్ స్టేషన్‌, పూణే మున్సిపల్ కార్పొరేషన్ ఫైర్ బ్రిగేడ్ నుంచి అనేక ఫైర్ అగ్నిమాప‌క నివార‌ణ యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటల అదుపు చేశాయి.

ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఫ్యాషన్ స్ట్రీట్ మార్కెట్ ప్రాంతంలో రాత్రి అర్థ‌రాత్రి ప్రాంతంలో మంటలు చెలరేగాయి. త‌క్కువ స‌మ‌యంలోనే మంట‌లు పరిసర ప్రాంతాలకు వ్యాపించాయి. దీంతో అక్క‌డ ఉన్న‌ట్టు వంటి షాపుల్లో 448 దుకాణాలు బుగ్గిపాలు అయ్యాయి. ప్ర‌మాద స‌మ‌చారం అందిన వెంట‌నే ఘటనా స్థలానికి చేరుకున్నామని చీఫ్‌ ఫైర్‌ఫైంటింగ్‌ ఆఫీసర్‌ ప్రశాంత్‌ రాన్‌పైస్‌ వెల్లడించారు.

తక్కువ సమయంలోనే పక్కనే ఉన్న షాపులకు మంటలు వ్యాపించాయి. దీంతో 16 ఫైర్ ఇంజన్లతో మంట‌ల‌ను అదుపులోకి తీసుకువచ్చారు. కాగా, ఫ్యాషన్ స్ట్రీట్ దుస్తులు, పాదరక్షలు, ఉప‌క‌ర‌ణలు విక్రయించే దాదాపు 500 ల‌కు పైగా దుకాణాలు ఉన్నాయి. ఈ ఘటనలో కోట్ల విలువైన వస్తువులు ధ్వంసమయ్యాయి. ఈ ప్ర‌మాదంలో ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేద‌నీ, అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు వెల్ల‌డించారు.

సినీ వ‌ర్గాల‌ను వ‌ద‌ల‌ని క‌రోనా

బ్లాక్ కాఫీతో ఆ సమస్యలన్నీ పరార్

మామిడితో బరువు పెరుగుతారా?

నోరూరించే హోళీ స్పెషల్స్

తిరుపతి ఎన్నిక: బీజేపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -