Sunday, April 28, 2024
- Advertisement -

ఏయూ లో కరోనా కలకలం!

- Advertisement -

ఏయూ ఇంజినీరింగ్ విద్యార్థులు 59 మందికి కరోనా పాజిటివ్… మొత్తం 820శాంపిల్స్ కలెక్షన్ చేస్తే.. 400 మంది ఫలితాలు వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ క్యాంపస్ 7 హాస్టల్స్ బ్లాక్ లను కంటైన్ మెంట్ జోన్ పరిధిలోకి తీసుకువచ్చిన వైద్యాధికారులు. విజయవాడ నుంచి వచ్చిన ఇంజనీరింగ్ విద్యార్థికి మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదు అయ్యింది.

ఆ తర్వాత పలువురుకి కరోనా పాజిటీవ్ వచ్చినట్లు సమాచారం. తగ్గిపోయాయి అనుకున్న కరోనా కేసులు మళ్లీ విస్తరిస్తుండడంతో అధికారుల్లో కలవరం మొదలైంది. క్యాంపస్ లో మొత్తం 820 మందికి పరీక్షలు చేయగా.. 420 మంది రిపోర్ట్స్ వచ్చాయి. ఇంకా 400 మంది రిపోర్ట్స్ రావాల్సి ఉంది. ఆ వచ్చిన వారిలో 59 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది.

వీరింతా హాస్టల్లో ఉండే విద్యార్థులే.  కాగా, భాస్కర్ హాస్టల్, థామస్ హాస్టల్, విశాఖ న్యూటన్ హాస్టల్, జె.సి రోస్ హాస్టల్, అంబేద్కర్ హాస్టల్,స్వామి వివేకానంద హాస్టల్, రవీంద్ర నాధ్ ఠాగూర్ హాస్టల్ సానిటైజేషన్ చేస్తున్న జివిఎంసి అధికారులు తెలిపారు.

విశాఖ ఏయూ క్యాంపస్ లో 55 మందికి ఒకేసారి కరోనా నిర్ధారణ అవ్వడంతో.. క్యాంపస్ లో జరిగే పరీక్షలను అన్నీ రద్దు చేసి.. సెలవులు ఇవ్వాలని తోటి విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఎగ్జామ్స్ గురించే తాము క్యాంపస్ లో ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పుణెలో భారీ అగ్నిప్రమాదం.. 448 షాపులు దగ్దం

సినీ వ‌ర్గాల‌ను వ‌ద‌ల‌ని క‌రోనా

‘ఆచార్య’ తో కలిసి వచ్చిన సిద్దా.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -