Saturday, April 20, 2024
- Advertisement -

అల్లు వారబ్బాయి మెడకు ఏమైయింది..!

- Advertisement -

అల్లు శిరీష్ హీరోగా నటించిన చివరి చిత్రం ఏబీసీడీ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయింది. ఆ తర్వాత తన నెక్స్ట్ మూవీ కోసం అల్లు అర్జున్ ఫిట్ గా మారాడు. సిక్స్ ప్యాక్ కూడా చేశాడు. కానీ ఏమైందో తెలియదు. తాజాగా అల్లు శిరీష్ మెడకు పట్టించి పెట్టుకొన్న ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.’ఫ్యాషన్ కు సంబంధించినది కాదు అంటూ’ కామెంట్స్ చేశాడు. దీంతో అతడు తొందరగా కోలుకోవాలని అల్లు అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.

అయితే జిమ్ లో వర్కౌట్లు చేస్తూ అల్లు శిరీష్ గాయపడినట్లు సమాచారం. 2013లో గౌరవం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టిన అల్లు శిరీష్ కు కూడా ఇప్పటివరకు సరైన విజయం దక్కలేదు. తన తండ్రి అల్లు అరవింద్ బడా ప్రొడ్యూసర్ అయినప్పటికీ, ఎన్నో బ్లాక్ బాస్టర్ లు ఇచ్చినప్పటికీ సొంత కొడుకుకు సూపర్ హిట్ ఇవ్వలేక పోతున్నాడు.

మారుతి, పరశురామ్ వంటి దర్శకులతో చేసినప్పటికీ ఎందుకనో శిరీష్ కి పెద్ద హిట్ పడలేదు.అల్లు శిరీష్ కెరీర్లో కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం వంటి సినిమాలు మాత్రమే పర్వాలేదనిపించాయి. ఆ సినిమాలు బాగున్నాయని టాక్ వచ్చినప్పటికీ ఎందుకో సూపర్ హిట్ అవలేదు. ఎలాగైనా సూపర్ హిట్ అందుకోవాలని అల్లు శిరీష్ ఎంతో కసితో పని చేస్తున్నాడు. అందులో భాగంగానే వర్కౌట్లు చేస్తూ గాయపడ్డాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -