Saturday, April 20, 2024
- Advertisement -

మళ్లీ సెట్స్ పైకి వచ్చిన మాస్ మహారాజా..!

- Advertisement -

2000 దశాబ్దంలో అత్యధిక సూపర్ హిట్ లు, అత్యధిక సినిమాల్లో నటించిన అగ్రహీరో రవితేజనే. ఆ పది, పన్నెండేళ్ళు రవితేజ టైం నడిచింది. వరుసగా ఎన్ని విజయాలు అందుకున్నాడో, ఆ తర్వాత వరుసగా ఎన్నో పరాజయాలు రవితేజను పలకరించాయి. మధ్యలో పవర్, బలుపు, రాజా ది గ్రేట్ వంటి సినిమాలు విజయం అందుకున్నప్పటికీ అవి రవితేజ స్థాయి హిట్ గా నిలబడలేదు.

ఆయన అపజయాలకు అడ్డుకట్ట వేస్తూ గత ఏడాది విడుదలైన క్రాక్ సినిమా పెద్ద హిట్ గా నిలిచింది. ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో రవి తేజ వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్నాడు. మళ్లీ ఒకప్పటి స్పీడ్ అందుకుంటున్నాడు. ప్రస్తుతం రవితేజ రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి అనే సినిమా చేస్తున్నాడు. దీంతో పాటు కొత్త డైరెక్టర్ శరత్ మండవ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు రవితేజ అంగీకరించాడు.

కాగా ఖిలాడి మూవీ కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోయింది. ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తి కాగా కొంతమేర షూటింగ్ పెండింగ్ లో ఉంది. పెండింగ్ సన్నివేశాలను చిత్రీకరించేందుకు రవితేజ మళ్లీ బరిలోకి దిగాడు. ఇవాళ సెట్స్ పైకి వచ్చాడు. హైదరాబాద్ లోని ఓ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ప్రత్యేక సెట్ లో ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం అయింది. ఆన్ ది సెట్స్ అఫ్ #RT 68 అంటూ రవితేజ షూటింగ్ లోకేషన్ ఫోటో ను ఇన్ స్టాలో షేర్ చేశాడు. ఖిలాడి మూవీలో దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటిస్తోంది.

Also Read

అల్లు వారబ్బాయి మెడకు ఏమైయింది..!

‘నారప్ప’ నుంచి లిరికల్ సాంగ్ వచ్చేది రేపే..!

రాజమౌళిపై రామ్​లక్ష్మణ్​లు సంచలన కామెంట్లు..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -