‘నారప్ప’ నుంచి లిరికల్ సాంగ్ వచ్చేది రేపే..!

- Advertisement -

ఎఫ్ -2, వెంకీ మామ వంటి వరుస హిట్లతో విక్టరీ వెంకటేష్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇప్పటికే దృశ్యం -2, నారప్ప సినిమాల షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. ఈ రెండు సినిమాల్లో ముందుగా నారప్ప సినిమా విడుదల కానుంది. ముందుగా నారప్ప సినిమాను ఓటీటీల్లో విడుదల చేయాలని భావించినప్పటికీ కొన్ని కారణాల వల్ల విడుదల చేయలేదు. జూలై ఆఖర్లో థియేటర్లు ఓపెన్ కానుండటంతో ఈ సినిమాను థియేటర్లోనే విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు.

నారప్ప తమిళ్ లో విజయం సాధించిన అసురన్ మూవీ కి రీమేక్. ఇందులో ధనుష్ హీరోగా నటించి తన నటనతో మెప్పించడం తో పాటు అవార్డులను సైతం కొల్లగొట్టాడు. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ కావడం తో తెలుగులో వెంకటేష్ చేస్తున్నాడు. సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తుండగా సురేష్ బాబు, కలై పులి థాను నిర్మిస్తున్నారు.

ఇందులో వెంకీ భార్యగా ప్రియమణి నటిస్తోంది. కాగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్, టీజర్ ఇప్పటికే విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లిరికల్ సాంగ్ కూడా రేపు ఉదయం 10 గంటలకు విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మూవీ ఆగస్టు మొదటివారంలో విడుదల అయ్యే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -