60 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్న ప్రముఖ నటుడు

Actor Ashish Vidyarthi Rupali Barua Second Marriage
Actor Ashish Vidyarthi Rupali Barua Second Marriage

‘కాల్ సంధ్య’ సినిమాతో చిత్రరంగంలోకి ప్రవేశించిన బహు భాషా నటుడు ఆశిష్ విద్యార్థి. ఆశిష్ విద్యార్థి అటు హిందీ, ఇటు దక్షిణాది సినిమాల్లో 11భాషల్లో 300 చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. 60 ఏళ్ల ఆశిష్ విద్యార్థి అసోంకు చెందిన ఓ మహిళా వ్యాపారవేత్త రూపాలి బారువా ను రిజిస్టర్ మ్యారేజి చేసుకున్నాడు.

ఆశిష్ విద్యార్థికి 20 ఏళ్ల కిందట ప్రముఖ థియేటర్ ఆర్టిస్, సింగర్ రాజోషి బారువాను వివాహం చేసుకున్నారు. ఈమే నాటి బెంగాలి నటి శకుంతల బారువా కూతురు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ప్రస్తుతం వీరి దాంపత్యంలో కలతలు రావడంతో విడిపోయారు.

మొదట్లో స్నేహితులుగా ఉన్న ఆశిష్ విద్యార్థి, రూపాలి గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీళ్లిద్దరు ప్రేమికులై, పెళ్లితో ఒక్కటయ్యారు. ఇప్పుడు ఆశిష్‌ను పెళ్లాడినా రూపాలి కోల్ కతాలోని ఓ ఫ్యాషన్ స్టోర్ వ్యాపారంలో భాగస్వామి అని తెలుస్తోంది.