Sunday, April 28, 2024
- Advertisement -

మెంతులతో ఎన్నో ప్రయోజనాలు…

- Advertisement -

మెంతులు తెలియని వారు ఉండరు. ప్రతీ వంటగదిలో తప్పకుండా ఉండే ఐటమ్ ఇది. మెంతి పొడిని పప్పుల్లో, పులుసుల్లో, పచ్చళ్లలో కలుపుతారు. అలాగే మెంతి కూర (ఆకు కూర) ను కూడా పప్పు, కూరలలో వాడుతూ ఉంటారు. మెంతులు పసుపు రంగులో ఉంటాయి. మంచి సువాసనను కలిగి ఉంటాయి. మెంతి ఆకులను పప్పుకూరగా, కూరల తయారీలోనూ వాడడం తెలిసిందే. మెంతులలో ఔషధగుణాలనున్నాయని చాలా మందికి తెలుసు. తులను ఆయుర్వేదంలో దీపనీ, మిత్రి అని అంటారు. హిందీలో మెథీ అని పిలుస్తారు.

మెంతులను ఇంగ్లీషులో ఫెనుగ్రీక్ గింజలు అంటారు. గింజల్లోని జిగురు, చెడు రుచి కూడా ఈ రసాయనాల వల్లనే. జీర్ణాశయం సంబంధ సమస్యలకు మెతులు మంచి ఔషధం. స్థూలకాయం, చెడు కొలెస్టరాల్‌, మధుమేహం అదుపునకు ఇవి దోహదపడతాయి. అంతే కాదు మెంతుల్లో మరన్ని గొప్పు ఔషధ గుణగణాలున్నాయి. యాబెటిస్ వ్యాధిగ్రస్తులకు తరచూ మెంతులను వాడమని సలహా ఇస్తారు ఎందుకంటే దీనిలో మధుమేహాన్ని నియంత్రణ చేసే శక్తి ఉంది.

Also Read: చెమ‌ట బాగా ప‌డుతుందా..? అయితే ఇలా చేయండి..!

మెంతులకు టైప్ 2 డయాబెటిస్ ను తగ్గించే గుణం ఉందని అధ్యయనాల్లో తేలింది. మెంతులు గుండెలోని రక్తనాళాల పనితీరును మెరుగు పరుస్తుంది. గుండెపోటు రావడానికి ముఖ్యమైన కారణం గుండె కవాటాలు మూసుకుపోవడం. అయితే ఒకవేళ అప్పటికే కొంత హాని జరిగినా మెంతుల వల్ల ఇకపై గుండెకు హాని జరగకుండా కాపాడుతుంది. మెంతి ఆకుల్లో ఇనుము సమృద్ధిగా ఉంటుంది. దీంతోపాటు విటమిన్‌-సి, బి1, బి2, కాల్షియం కూడా ఉంటాయిఅతి తక్కువ కేలరీలు. కనుక మంచి సువాసనగాను, ఆరోగ్యంగా బరువు తగ్గేటందుకు మెంతులను వాడుకోవచ్చు.

బాలింతల్లో పాల ఉత్పత్తిని పెంచుతుంది: బాలింతలకు మెంతుల కషాయం, మెంతి కూర పప్పు ఎక్కువగా తినిపిస్తే పాలు ఉత్పత్తి పెరుగుతుంది. తల్లిపాలు తాగే ఎవరైనా సరే ఆరోగ్యంగా పెరుగుతారు. బాలింతలకు మెంతులతో తయారు చేసిన పదార్థాలను తినిపించడం దేశ వ్యాప్తంగా ఉంది. ఉత్తర భారతదేశంలో బాలింతలకు మెంతి హల్వా పెడతారు.

Also Read: కరెక్ట్ టైమ్‍కి తినకపోతే ఏమవుతుందో తెలుసా?

మెంతుల్లో బోలెడు ఔషధ గుణాలు ఉంటాయి. ప్రోటీన్, కొవ్వులు, కార్బోహైడ్రేట్, కాల్షియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, సి, కె, బి, మాంగనీస్, మెగ్నీషియం, పొటాషియం, రాగి, జింక్, ఫైబర్ తదితర పోషకాలు మెంతికూరలో సమృద్ధిగా లభిస్తాయి. మెంతి ఆకలి, జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -