తమిళం నుండే కన్నడ భాష పుట్టిందని నటుడు కమల్ హాసన్ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించారు కమల్ హాసన్.
‘థగ్ లైఫ్’ ఆడియో విడుదల కార్యక్రమంలో కన్నడపై తను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు లేఖ రాశారు కమల్. మనందరిదీ ఒకే కుటుంబం అనే ఉద్దేశంతోనే ఆ రోజు అలా మాట్లాడానని కానీ, తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని కేఎఫ్‌సీసీకి రాసిన లేఖలో పేర్కొన్నారు కమల్‌హాసన్.
ఈ అంశంపై హైకోర్టు సైతం స్పందించింది. దీనిపై విచారణ జరిపి ఏ ఆధారాలతో కన్నడ తమిళ భాష నుండి పుట్టిందని వ్యాఖ్యలు చేశారని, ఒక్క క్షమాపణ చెబితే విషయం సద్దుమణుగుతుందని వ్యాఖ్యానించింది కర్ణాటక హైకోర్టు. మీరేమైనా చరిత్రకారుడా ? ఏ ఆధారాలతో అలాంటి వ్యాఖ్యలు చేశారు ? అంటూ కమల్ హాసన్ ను ప్రశ్నించింది . ఈ విషయంలో ఒక్క క్షమాపణ చెబితే విషయం సద్దుమణుగుతుందని వ్యాఖ్యానించింది.