Monday, May 20, 2024
- Advertisement -

చత్ర‌ప‌తి సినిమా విల‌న్ మృతి

- Advertisement -

టాలీవుడ్‌, బాలీవుడ్ సినిమాల్లో ప‌లు పాత్ర‌ల్లో న‌టించి రౌద్రం క‌న‌బ‌రుస్తున్న బాలీవుడ్ న‌టుడు న‌రేంద్ర ఝా(55) మృతి చెందాడు. బుధవారం తీవ్రమైన గుండెపోటుతో ఆయన మ‌ర‌ణించారు. బాలీవుడ్‌ స్టార్ హీరోలతో పలు కీలక ప్రాత్రల్లో నటించిన నరేంద్ర మోడలింగ్‌తో కెరియర్ ప్రారంభించిన ఆయ‌న ఆ త‌ర్వాత సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టారు. టీవీలో నటుడిగా కూడా ప్రఖ్యాతిగాంచారు.

2002లో ఫంటూష్‌ సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అనంతరం హదర్‌, రాయీస్‌, మొహంజోదారోలాంటి సినిమాల్లో మంత్రి పాత్ర‌ల‌తో క‌నిపించి నటనతో ఆకట్టుకున్నారు. మొన్న బాలీవుడ్‌ స్టార్ హీరో హృతిక్‌ రోషన్‌ మూవీ ‘కాబిల్‌’లో పోలీస్ అధికారి పాత్రలో కనిపించారు.

మ‌న తెలుగులోనైతే యమదొంగ, లెజెండ్‌, ఛత్రపతి సినిమాల్లో నరేంద్ర ఝా నటించారు. విల‌న్‌గా విశ్వ‌రూపం చూపించి హీరోల‌ను రెచ్చ‌గొట్టే పాత్ర‌ల్లో క‌నిపించాడు. ఆ త‌ర్వాత ఆయ‌న చివ‌రి సినిమా సల్మాన్‌ఖాన్ న‌టిస్తున్న రేస్‌-3 సినిమాలో న‌టించ‌రారు. ఆయ‌న మృతిపై బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ సినిమా న‌టీన‌టులు, ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు సంతాపం ప్ర‌క‌టించారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -