Monday, May 20, 2024
- Advertisement -

పవన్ వల్ల మహేష్ సినిమాకి కష్టాలు!

- Advertisement -

ఇప్పటివరకు సినిమాలు క్లాష్ కావడం చూసాం.. కానీ ఇప్పుడు కథల విషయంలో కూడా క్లాష్ అవుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు తర్వాత చేయనున్న సినిమాలకు సంబంధించిన కథలు ఒకే విధంగా ఉన్నాయని ఫిల్మ్ నగర్లో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. హీరోలు, డైరక్టర్లే వేరు .. మిగతాదంతా సేమ్ టు సేమ్ అని చెప్పుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో కాటమరాయుడు షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

మురుగదాస్ డైరక్షన్లో మహేష్ బాబు అభిమన్యుడు (వర్కింగ్ టైటిల్) సినిమా చిత్రీకణలో పాల్గొంటున్నారు. ఈ మూవీ తర్వాత ప్రిన్స్ కొరటాల శివ తో కలిసి సినిమా చెయ్యనున్నారు. “నిన్ను నువ్వు ప్రేమించుకో” అనే అంశంతో తయారైన కథలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రం షూటింగ్ జనవరిలో ప్రారంభం కానుంది. కాటమరాయుడు తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పవన్ కళ్యాణ్ చేయనున్న సినిమా కూడా పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న కథ కావడంతో అసలు చిక్కు వచ్చి పడింది.

అంతేకాకుండా ఈ చిత్రాన్ని నవంబర్ లోనే సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తన సినిమా కంటే త్రివిక్రమ్ మూవీనే ముందు వస్తుందని ఇప్పుడు ఎలా చేయాలనీ  కొరటాల శివ బాధ పడిపోయారంట. డైరక్టర్ పరిస్థితిని గమనించిన మహేష్ కథలో మార్పులు చేయమని సలహా ఇచ్చిన్నట్లు తెలిసింది. దీంతో కథలో కాకుండా క్యారక్టర్లలో స్వల్ప మార్పులు చేసే పనిలో కొరటాల శివ బృందం బిజీ అయింది…

Related

  1. పవన్ సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా?
  2. పవన్ కళ్యాణ్ దేవుడు అయ్యాడు!
  3. రాజమౌళి తో యుద్ధానికి దిగుతున్న మహేష్ బాబు ?
  4. మహేష్ సినిమా బిజినెస్ ఎంతో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -