Friday, May 17, 2024
- Advertisement -

యాంకర్ పై మండిపడ్డ సుమన్

- Advertisement -

సుమన్ కి కోపం వచ్చింది. అది మాములుగా కాదండోయ్ చాలా విపరీతంగా వచ్చేసింది. ఆ కోపం ఎవరి మీద వచ్చిందని ఆలోచిస్తున్నారా? తనని ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ పై విపరీతమైన కోపం వచ్చింది.

ఆ వివరాల్లోకి వెళ్ళితే…సుమన్  పుట్టినరోజు సందర్భంగా  ప్రత్యేకమైన ఇంటర్వ్యూ కోసం tv9 కి వెళ్ళాడు. ఆ ఇంటర్వ్యూ లో యాంకర్ సుమన్ సినీ జీవితానికి,వ్యక్తికత జీవితానికి సంబందించిన అనేక ప్రశ్నలను అడిగింది.

అన్ని ప్రశ్నలకు సుమన్ నవ్వుతూ చాలా ఓపికగా సమాధానాలు చెప్పాడు. కానీ యాంకర్ అడిగిన రెండు ప్రశ్నలకు మాత్రం విపరీతమైన కోపం వచ్చేసింది సుమన్‌కి . సుమన్ తన చేయిని యాంకర్ వైపు చూపి కోపాన్ని ప్రదర్శించాడు. ఇంతకీ ఆ ప్రశ్నలు ఏమిటంటే సుమన్ జీవితంలో కీలకమైన పుకార్లను యాంకర్ అడిగింది.

మొదటిది చిరు తన ఎదుగుదల కోసం సుమన్ ని కేసుల్లో ఇరికించాడా ? రెండోవది కేసిఅర్  కి ఎందుకు సపోర్ట్ ఇస్తున్నారు? ఈ ప్రశ్నలను అడగగానే సుమన్ కి కోపం వచ్చింది. చిరంజీవి చాలా మంచి వ్యక్తి అని, అప్పుడు ఇప్పుడు తెర మీద ఒకేలా ఉన్నారని ప్రశంసించాడు. కెసిఅర్ మీద కూడా నాలుగు మంచి మాటలు చెప్పాడు. ఏది ఏమైనా తన మీద వచ్చిన పుకార్ల మీద ఘాటుగా స్పందించటం కొంత వరకు కరెక్ట్ అని చెప్పవచ్చు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -