Friday, May 10, 2024
- Advertisement -

ఎన్టీఆర్‌, త్రివిక్రమ్ సినిమాలో సెక్యూరిటీ అధికారిగా క‌మెడియ‌న్‌

- Advertisement -

హాస్య‌న‌టుడిగా పునః ప్ర‌వేశిస్తున్న సునీల్‌కు మంచి విజ‌యం అందించాల‌ని ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ఉన్నాడు. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో సునీల్‌ను తీసుకున్నారు. ఇటీవ‌ల హీరోగా వ‌రుస ఫెయిల్యూర్స్ చ‌విచూస్తున్న సునీల్‌కు కమెడియన్‌గా మంచి హిట్ ఇవ్వాల‌నే ఉద్దేశంతో సునీల్‌కు త్రివిక్రమ్ మంచి పాత్ర ఇచ్చార‌ని స‌మాచారం.

సునీల్ కోసం త్రివిక్ర‌మ్ రాసిన కామెడీ ట్రాక్‌లు ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకునేలా ఉన్నాయ‌ని తెలుస్తోంది. ఈ సినిమాతో సునీల్‌కు సినీ అవకాశాలను పెరిగేలా చేస్తాయ‌నే ధీమాతో త్రివిక్ర‌మ్ ఉన్నారు.

ఎన్టీఆర్‌తో చేస్తున్న సినిమాలో సునీల్‌కి సెక్యూరిటీ ఆఫీసర్ పాత్ర త్రివిక్ర‌మ్ ఇచ్చాడు. సునీల్ కోసం ఈ పాత్రను ప్ర‌త్యేకంగా రూపొందించారు. సునీల్‌ను మళ్లీ సినీ ప‌రిశ్ర‌మ‌లో నిలబెట్టేలా ఆ పాత్ర ఉండే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు చేసుకుంటోంది. ఎన్టీఆర్ ఈ సినిమా కోసం ప్ర‌త్యేకంగా క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్‌లో సెట్స్‌పైకి వెళ్లే అవ‌కాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -