Sunday, May 5, 2024
- Advertisement -

యూకేలో ‘అదిరింది’గా.. మెర్స‌ల్ సినిమాకు అవార్డు

- Advertisement -

విదేశీ సినిమాలు ఏడింటితో పోటీ ప‌డి మ‌రీ మ‌న భారత సినీ ప‌రిశ్ర‌మ స‌త్తా చాటింది. మ‌న తెలుగులో విడుద‌లైన అదిరింది సినిమా (త‌మిళ్‌లో మెర్స‌ల్‌) సినిమా 2018 ఉత్త‌మ విదేశీ సినిమాగా అవార్డు పొందింది. యూకేలో జ‌రిగిన 4వ జాతీయ చ‌ల‌న చిత్ర ఉత్స‌వాల్లో తమిళ స్టార్‌ హీరో విజయ్‌ నటించిన ‘మెర్సల్‌’ సినిమా అవార్డు ద‌క్కించుకుంది.

ఈ ఉత్స‌వాల్లో ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ‘మెర్సల్‌’ అవార్డు గెలుచుకుంది. ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ‘మెర్సల్’తోపాటు ‘హ్యాపీ ఎండ్‌’ (ఫ్రాన్స్‌ చిత్రం), ‘లవ్లీస్‌’ (రష్య), ‘ఇన్‌ ది ఫేడ్‌’ (జర్మనీ/ఫ్రాన్స్‌), ‘ది స్క్వేర్‌ ‌’ (స్వీడెన్/జర్ననీ/ఫ్రాన్స్‌‌), ‘ఎ ఫెంటాస్టిక్ విమెన్‌‌’ (చిలీ), ‘వాయ’ (దక్షిణాఫ్రికా), ‘ది ఇన్సల్ట్‌’ (లెబనన్‌‌) చిత్రాలు పోటీపడ్డాయి. భారత్‌ నుంచి ‘మెర్సల్‌’ సినిమా ఎంపికై ఆ సినిమాలతో పోటీప‌డింది. చివ‌రికి మెర్స‌ల్ విజయం పొందింది.

ఈ విష‌యంపై ఆ సినిమా నిర్మించిన శ్రీ థెనాండల్‌ ఫిల్స్మ్ హ‌ర్షం వ్య‌క్తం చేసింది. ఈ ‘మెర్సల్’ సినిమాకు అట్లీ దర్శకత్వం వహించగా ‘బాహుబలి’ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ ఈ సినిమాకు కథ రాశారు. కాజల్, సమంత, నిత్యామేనన్ హీరోయిన్లుగా న‌టించిన ఈ సినిమా గ‌తేడాది న‌వంబ‌ర్‌లో తెలుగు, త‌మిళ్‌లో విడులై మంచి విజ‌యం పొందింది. వివాదాస్ప‌ద‌మైంది కూడా. పేదలకు ఉచితంగా వైద్యం ‌అందించాలనే నేప‌థ్యంలో సినిమా ఉంది. దీంతో అంత‌ర్జాతీయ వేదిక‌పై ఈ సినిమాకు అవార్డు ల‌భించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -