Sunday, May 19, 2024
- Advertisement -

న్యూ ఇయ‌ర్ నాడు కోలివుడ్‌లో విషాదం

- Advertisement -

కొత్త సంవ‌త్స‌రం నాడు త‌మిళ సినీ పరిశ్ర‌మ‌లో విషాదం అలుముకుంది. కోలీవుడ్ అగ్ర నటుడు విక్రమ్‌ తండ్రి వినోద్‌రాజ్‌ (80) అనారోగ్యంతో మృతిచెందారు. విక్ర‌మ్ తండ్రి వినోద్‌రాజ్‌ పలు కన్నడ, తమిళ చిత్రాల్లో నటించారు. వినోద్‌రాజ్ హీరో విజయ్‌ నటించిన ‘తిరుప్పాచ్చి’, ‘గిల్లి’ సినిమాల్లో నటించారు. నృత్య రంగంలోనూ మంచి గుర్తింపు పొందిన ఆయ‌న కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. ఈ స‌మ‌యంలో ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు.

ఆయన భౌతికకాయాన్ని బంధువులు, స్నేహితుల సందర్శనార్థం కోడంబాక్కంలోని మహాలింగపురంలో స్వగృహంలో ఉంచారు. వినోద్‌రాజ్‌ మృతిపట్ల చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. త‌మిళ్ సినీ ప‌రిశ్ర‌మ ఓ కుటుంబంలా ఉంటుంది. ఎవ‌రికీ ఏం జ‌రిగినా అంద‌రూ బేష‌జాలు వీడి ఒక్క‌ట‌వుతారు. ఈ విషాద స‌మ‌యంలో కొత్త సంవ‌త్స‌ర వేడుక‌ల‌కు దూరంగా త‌మిళ్ సినిమా దూరంగా ఉంది. vతండ్రి బాట‌లోనే తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా విక్ర‌మ్ గుర్తింపు పొందాడు. విక్ర‌మ్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా సుప‌రిచ‌త‌మే. విక్ర‌మ్ సినిమాలు తెలుగులో అప‌రిచితుడు, మ‌ల్ల‌న్న‌, ఐ త‌దిత‌ర చిత్రాల‌తో ఆక‌ట్టుకున్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -