Saturday, May 18, 2024
- Advertisement -

2018 లో చంద్ర‌బాబును టెన్ష‌న్‌ పెడుతున్న ప‌లు స‌మ‌స్య‌లు

- Advertisement -

2018 సంవ‌త్స‌రంలో చంద్ర‌బాబునాయుడి ముందు ప‌లు స‌వాల్లు ఉన్నాయి. అవే బాబులో రోజు రోజుకీ టెన్స‌న్ పెంచుతున్నాయి. ఒక‌వైపు ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్య‌లో పలు ప‌రిణామాలు బాబును ఇబ్బందుల‌కు గురిచేస్తున్నాయి.

రాష్ట్రంలో ఒక వైపు జ‌గ‌న్ చేప‌డుతున్న పాద‌యాత్ర‌కు వ‌స్తున్న విశేష స్పంద‌న ప్ర‌ధానంగా బాబును క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తోంది. మ‌రో వైపు మిత్ర‌ప‌క్షం భాజాపా బాబుమీద క‌త్తులు ,మిరియాలు నూరుతోంది. బాబు విష‌యంలో ప్ర‌ధాని మంత్రి వైఖ‌రి అర్థం కాక‌పోవ‌డంతో భ‌విష్య‌త్తు అర్థంకాక బాబులో ఆందోళ‌న పెరుగుతోంది.

ప్రతిపక్ష వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు జనాల అపూర్వ స్పందన వ‌స్తూంటే మ‌రో వైపు భాజపా నేత సోము వీర్రాజు చంద్రబాబును వరసబెట్టి వాయించేస్తున్నారు. రోజురోజుకు రెచ్చిపోతున్నారు. చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని వీర్రాజు రెచ్చిపోతుండటంపై అనుమానాలు మొదలయ్యాయి.

చంద్రబాబును ప్రధానమంత్రి నరేంద్రమోడి పూర్తిగా దూరం పెట్టటం. ఏడాదిన్నరగా ప్రధాని అపాయిట్మెంట్ కోసం చంద్రబాబు ఎంత ప్రయత్నించినా సాధించలేకపోతున్నారు. మళ్ళీ, ఇందులో చంద్రబాబును ఇరుకునపెడుతున్న విషయం మరొకటి ఉంది.ఏడాదిన్నరగా తనకు అపాయిట్మెంట్ ఇవ్వని ప్రధానమంత్రి వైసిపి నేతలకు మాత్రం ఇస్తుండటం. ఇదే ఏడాదిలో రాష్ట్రపతి ఎన్నికలకు ముందు 15 నిముషాల పాటు జగన్మోహన్ రెడ్డితో ఏకాంతంగా భేటీ అయ్యారు. తర్వాత లక్ష్మీపార్వతితో కూడా సమావేశమయ్యారు. తాజాగా వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డితో 15 నిముషాలు మాట్లాడారు.

ఈ విషయంలోనే మోడి వైఖరి ఏంటో అర్ధంకాక చంద్రబాబుతో పాటు టిడిపి నేతలు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి భాజపా ఏమైనా నిర్ణయం తీసుకుందా అన్న అనుమానాలు టిడిపిలో మొదలైంది. ఉద్దేశ్య పూర్వ‌కంగానే మోదీ దూరంపెడుతున్నార‌నే ఆందోల‌న టీడీపీ నేత‌ల‌లో మొల‌య్యింది. కొత్త సంవ‌త్స‌రం అయినా బాబుకు క‌ల‌సి వ‌స్తుందో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -