Monday, April 29, 2024
- Advertisement -

పాక్‌తో సిరీస్‌లు ఎక్క‌డా ఆడే ప్ర‌స‌క్తే లేదు..కేంద్ర మంత్రి సుష్మాస్వ‌రాజ్‌..

- Advertisement -

భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్‌ల్ని తటస్థ వేదికలోనూ జరిపే ఉద్దేశం భారత్‌కు లేదని విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ స్పష్టం చేశారు. మంత్రిత్వ శాఖకి చెందిన సంప్రదింపుల కమిటీతో సోమవారం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదే పదే పాకిస్థాన్ ఉల్లంఘిస్తుండటాన్ని సుస్మా తప్పుబట్టారు.

ఈ సంద‌ర్భంగా పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌ ఒప్పందం గురించి చర్చకు రాగా.. రెండు దేశాల మధ్య ప్రస్తుతం సామరస్య వాతావరణం లేనందున మ్యాచ్‌లు నిర్వహించలేమని సుష్మాస్వరాజ్ వెల్లడించారు.
2014లో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)తో 2015-2023 మధ్య కాలంలో ఆరు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడేలా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒప్పందం కుదుర్చుకుంది. ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం క్రమంగా దెబ్బతింటుండటంతో బీసీసీఐ పాకిస్థాన్‌తో మ్యాచ్‌ల‌ను ప‌క్క‌న పెట్టేసింది.

పీసీబీ మాత్రం.. సిరీస్‌లు నిర్వహించాలని.. లేదంటే రూ.400 కోట్లు నష్టపరిహారంగా చెల్లించాలంటూ ఐసీసీని ఆశ్రయించింది. వేదిక పరంగా భారత్, పాకిస్థాన్‌లో మ్యాచ్‌లు నిర్వహించేందుకు బీసీసీఐకి ఇష్టం లేకపోతే.. తటస్థ వేదికగా దుబాయ్‌లో సిరీస్ జరపాలని సూచించింది. ఈ తటస్థ వేదిక పాక్ సూచనని సుష్మాస్వరాజ్ తాజాగా కొట్టిపారేశారు. ప్ర‌స్తుతం పాక్‌తో మ్యాచ్‌లు జ‌రిగే ప‌రిస్థితులు క‌నిపించ‌డంలేదు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -