Sunday, May 12, 2024
- Advertisement -

స‌ర్జ‌రీకి అమెరికా వెళ్లిన ‘స్టార్ హీరో’

- Advertisement -

షూటింగ్‌లో గాయ‌ప‌డి సాధార‌ణ వైద్యం అందించుకొని హీరో సినిమా పూర్తి చేశాడు. ఇప్పుడు ఆ గాయానికి చికిత్స అందించుకోవ‌డానికి అమెరికాకు స‌ర్జ‌రీ కోసం వెళ్లాడు. ఆ గాయానికి స‌ర్జ‌రీ త‌ప్ప‌నిస‌రి కావ‌డంతో చికిత్స కోసం త‌ర‌లివెళ్లాడు. ఢిల్లీలో వైద్యుల సూచ‌న మేర‌కు అమెరికాలో చికిత్స కోసం త‌ర‌లివెళ్లాడు.

చికిత్స కోసం సినీ నటుడు విశాల్‌ అమెరికాకు వెళ్లారు. ఆయన చికిత్స ముగించుకుని మరో పది రోజుల తర్వాత చెన్నైకి చేరుకునే అవ‌కాశం ఉంది. విశాల్ ప్రస్తుతం ‘తుప్ప రివాళన్‌’ సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ సమయంలో విశాల్‌ గాయపడ్డాడు. దీంతో మోకాలికి గాయమైంది. ఆ స‌మ‌యంలో తాత్కాలిక చికిత్స అందించుకోగా విశాల్‌కు తీవ్రమైన తలనొప్పి కూడా వ‌చ్చింది. ఆ సినిమా షూటింగ్ పూర్త‌వ‌డంతో ఇటీవల ఢిల్లీలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందాడు.ఇంకా మెరుగైన చికిత్స కోసం ఆయన అమెరికాకు వెళ్లాడు. అక్కడ ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొంద‌నున్నాడు. మరో పది రోజుల్లో చెన్నైకు చేరుకుని విశాల్ త‌న కార్య‌క్ర‌మాల‌తో బిజీ కానున్నాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -