Sunday, May 19, 2024
- Advertisement -

ఎందుకు అమ‌ల అంత క‌క్కుర్తి

- Advertisement -
  • హీరోయిన్ అమ‌లాపాల్ అరెస్టు, విడుద‌ల‌

సినీ ప‌రిశ్ర‌మ‌లో రాణిస్తూ బాగానే సంపాదిస్తున్నా చిన్న చిన్న వాటి కోసం క‌క్కుర్తి ప‌డుతూ న‌ష్టాలు, క‌ష్టాలు కొని తెచ్చుకుంటున్న వారిలో అమ‌లాపాల్ కూడా చేరిపోయింది. పన్ను ఎగ్గొట్టడానికి ప్రయత్నించిన కేసులో హీరోయిన్ అమలాపాల్‌ను పోలీసులు ఆదివారం (జ‌న‌వ‌రి 28) అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆమె బెయిలుపై విడుదలైంది.

గతేడాది అమ‌లాపాల్ రూ. కోటి ఖ‌ర్చుచేసి మెర్సిడేస్ బెంజ్ ఎస్ క్లాస్ కారు కొన్న‌ది. ఆ కారు రిజిస్ట్రేష‌న్ కోసం త‌ప్పుడు దారి ఎంచుకుంది. కొంచెం త‌క్కువ ఖ‌ర్చు అని వేరే రాష్ట్రంలో తప్పుడు చిరునామా పత్రాలతో పాండిచ్చేరిలో రిజిస్టర్‌ చేయించుకుంది.

కేరళలో చెల్లించాల్సిన రూ.20 లక్షల పన్ను ఎగవేయాలనే ఆలోచ‌న‌తో అమలాపాల్‌ ఇలా చేసింది. దీంతో కేరళలో 430, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆమె ముందస్తు బెయిలు కోసం ప్ర‌య‌త్నించ‌గా ముందు క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజ‌రుకావాల‌ని కేరళ హైకోర్టు చెప్పింది. దీంతో ఆమె తిరువనంతపురంలోని క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసుల ముందు హాజరుగా ఆమె తప్పును అంగీక‌రించింది. దీంతో ఆమెను అరెస్టు చేయ‌గా ఆ తర్వాత వెంట‌నే కోర్టు బెయిలు మంజూరు చేసింది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -