- Advertisement -

టీ20 మ్యాచ్‌లో ఇలా కూడా ర‌నౌట్ అవుతారా…?

- Advertisement -

యూఏఈలో జరుగుతున్న అజ్మాన్ ఆల్‌స్టార్స్ ప్రైవేట్ టీ20 లీగ్‌పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కన్నెర్రజేసింది. టోర్నీలోని ఓ మ్యాచ్‌లో జట్టు బ్యాట్స్‌మెన్ మొత్తం నిర్ల‌క్షం వ‌హించారు. మ్యాచ్‌లో నిర్ల‌క్ష్యంగా రనౌట్, స్టంపౌట్స్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఐసీసీ ఆ టీ20 లీగ్‌పై విచారణ చేపట్టింది.

అస‌లు విష‌యానిక‌వ‌స్తే షాట్ కోసం క్రీజు వెలుపలికి వెళ్లిన బ్యాట్స్‌మెన్ బంతి అందకపోవడంతో.. తిరిగి మళ్లీ క్రీజులోకి వచ్చేందుకు ప్రయత్నించకపోవడం.. స్టంపౌట్‌కి ప్రయత్నించిన కీపర్ చేతి నుంచి బంతి జారిపోయినా.. బ్యాట్స్‌మెన్‌లో స్పందనలేకపోవడం.. రనౌటయ్యేందుకే బ్యాట్స్‌మెన్ పిచ్ మధ్యలోనే ఆగిపోవడం వంటి ఘటనలు ఐసీసీకి కోపం తెప్పించాయి.

ఐసీసీ అవినీతి నిరోధక విభాగం ప్రస్తుతం ఆ టీ20 లీగ్‌పై విచారణ ప్రారంభించింది. యూఏఈ నుంచి ఈ టోర్నీకి ఎలాంటి అనుమతి లేదు. ఇప్పటికే మ్యాచ్ అధికారులు, నిర్వాహకులతో మాట్లాడాం. మ్యాచ్‌ ఫిక్యయ్యిందా లేదా అనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేం. అజ్మాన్ ఆల్‌స్టార్స్ లీగ్‌ని మాత్రం తాత్కాలికంగా నిషేధించాం’ అని ఐసీసీ అవినీతి నిరోధక విభాగం జనరల్ మేనేజర్ అలెక్స్ మార్షల్ వెల్లడించాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -