Sunday, April 28, 2024
- Advertisement -

కల్కిలో ప్రభాస్ సరసన మలయాళ భామ!

- Advertisement -

ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ గ్లోబల్ ఫిల్మ్ ..కల్కి 2898 ADకి సంబంధించి మరో అప్‌డేట్ వచ్చేసింది. ఇప్పటికే ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ దిగ్గజ నటులు భాగస్వాములు కాగా తాజాగా మరో మలయాళ భామ చేరింది.

మలయాళ హీరోయిన్ అన్నా బెన్ కల్కిలో ఓ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించగా మలయాళ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా ఉన్నారు అన్నా బెన్. ప్రపంచవ్యాప్తంగా మే 9న విడుదల కానుంది కల్కి.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ తో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇక టీజర్ గ్లింప్స్ ప్రపంచవ్యాప్త ప్రశంసలను పొందింది. ఈ చిత్రం కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మైథాలజీ ఇన్స్పైర్డ్ ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ చిత్రంగా వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకు దృశ్యకావ్యాన్ని అందించబోతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -