Sunday, April 28, 2024
- Advertisement -

అమెజాన్ అడవుల్లో మహేష్‌..!

- Advertisement -

గుంటూరు కారం తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు…దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతుండగా ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడు కథగా ఈ సినిమా ఉండబోతోంది.

హాలీవుడ్ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రాజమౌళి సిద్ధం అవుతుండగా ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయింది. అయితే ప్రస్తుతం మహేష్ బాబు జర్మనీకి వెళ్లడంతో ఇది జక్కన్నతో సినిమా కోసమేనని ప్రచారం జరుగుతోంది.

అయితే అసలు విషయం మాత్రం ఓ డాక్టర్ ని కలిసేందుకు జర్మనీ వెళ్లారు మహేష్. ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ అమెజాన్ అడవుల్లో ప్లాన్ చేస్తున్నారట. అక్కడి పరిస్థితులకు, మూవీకి అవసరమైన ఫిట్ నెస్ సాధించేందుకే డాక్టర్ హరీ కొనిగ్ ని కలిశారు మహసష్. అడ్వెంచర్, యాక్షన్ స్టంట్లు ఎక్కువగా ఉండనుండటంతో ఫిట్ నెస్ చాలా ముఖ్యం. అందుకే జర్మనీకి వెళ్లి మహేష్ బాబు ఆ డాక్టర్ ని కలుసుకున్నారు. మొత్తంగా రాజమౌళి మూవీ కోసం అప్పుడే కసరత్తు ప్రారంభించారు మహేష్. ఇక ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -