Thursday, May 2, 2024
- Advertisement -

Ram Mandir:అంతా రామమయం!

- Advertisement -

ఐదు శతాబ్దాల భారతీయుల కల నెరవేరబోతోంది. అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్టకు సర్వం సిద్ధం కాగా ప్రపంచ దేశాల్లోని భారతీయులంతా ఈ మహోత్తర వేడుకను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షేంచేందుకు ఎదురు చూస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మధ్యాహ్నం రామ్ లల్లా విగ్రహాన్ని ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు.

2.7 ఎకరాల్లో అయోధ్య రామాలయం విస్తరించి ఉండగా ఆలయం 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించారు. మొత్తం 392 స్తంభాలు, 44 ద్వారాలు ఉంటాయి. 51 అంగులాల పొడవు ఉన్న బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు.

ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి దేశ,విదేశాల ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లాయి. 8 వేల మంది ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లగా ప్రపంచ దేశాల అతిథులతో పాటు పారిశ్రామిక వేత్తలు,సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. ప్రపంచ దేశాల నుండి అతిథులు రానుండగా , అయోథ్యకు వచ్చే అతిథులతో పాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసింది శ్రీరామతీర్థ క్షేత్ర ట్రస్ట్. వీవీఐపీల భద్రత కోసం 45 ప్రత్యేక బృందాలు గస్తీ కాస్తున్నాయి.

ఇక రామాలయం ప్రారంభం సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలంతా ఇళ్లలో దీపాలు వెలిగించనున్నాయి. అన్ని ఆలయాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరగనున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -