Thursday, May 16, 2024
- Advertisement -

వామ్మో…! నాకు పెళ్ళా అంటున్న ఛార్మీ

- Advertisement -

సినిమా ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చి అర‌కొర పాత్ర‌ల‌తో సంద‌డి చేస్తున్న హీరోయిన్ ఛార్మి. ఈ అమ్మ‌డు ఇప్పుడు సినిమాల్లో క‌నిపించ‌క చాలా రోజులైంది. అయితే ఈ హీరోయిన్ వ‌య‌సు చాలా పెద్ద‌దే. ఈ విష‌యం మ‌న‌సులో పెట్టుకుని మీడియా ఆమె ఎదుర‌వుతే చాలు కొన్ని ప్ర‌శ్న‌లు అడుగుతారు. ఆ త‌ర్వాత మీ పెళ్లెప్పుడు? ఎలాంటి వాడు కావాల‌నుకుంటున్నారు? ఏం ల‌క్ష‌ణాలు ఉండాల‌ని త‌దిత‌ర ప్ర‌శ్న‌లు పూస‌గుచ్చిన‌ట్టు అడుగుతారు. ఇదే విష‌య‌మై ఇటీవ‌ల చార్మిని అడిగితే భిన్నంగా స్పందించింది.

అసలు తనకు పెళ్లిపై నమ్మకమే లేదని ఛార్మి చెప్పేసింది. ఎవరో ఒక కొత్త వ్యక్తి తన జీవితంలోకి వచ్చేసి.. ఇప్పుడు తను చేస్తున్న దాని గురించి ప్రశ్నించడం.. నిలదీయడం వంటివాటిని అస్సలు తట్టుకోలేదని ఛార్మి బ‌దులిచ్చింది. ‘నేను ఎక్కువగా సినిమా లోకంలోనే గడుపుతాను. ఫ్రెండ్స్‌తో వెకేషన్స్‌కు వెళ్తుంటా. సో.. ఎక్కువగా అందుబాటులో ఉండే అవకాశం ఏ మాత్రం లేదు. రెండోది గారాబం చేయడం.. ఇది కొన్నాళ్లు మాత్రమే ఉంటుందనే విషయంలో ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది చార్మి.

ప్ర‌స్తుతం చార్మి ద‌ర్శ‌కుడు పూరీ జగ‌న్నాథ్‌కు సంబంధించి సినిమా టీమ్‌లో ప‌ని చేస్తోంది. ఇప్పుడు ఆకాశ్ హీరోగా మోహ‌బూబా సినిమా కోసం ఛార్మి క‌ష్ట‌ప‌డుతోంది. గ‌తంలో ఛార్మికి సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన వ్యక్తితో ప్రేమాయ‌ణం జ‌రిగింది అని పుకార్లు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత అవి కాల‌గ‌ర్భంలో క‌లిసిపోయాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -