Wednesday, May 15, 2024
- Advertisement -

కుటుంబం కోసం సెక్సీ స్టార్‌న‌య్యా.. నన్ను వాడుకొని వ‌దిలేశారు..

- Advertisement -

దాదాపు 250 వరకు సినిమాలు చేసిన మలయాళ న‌టి శ‌కీలా. ఆమె నేటివిటీ మ‌ల‌యాళం అయినా అన్ని భాషల‌ ప్రేక్ష‌కులకు తెలిసిందే. అన్ని సినిమాల్లో అలాంటి పాత్ర‌లు రావ‌డంతో ఆమె కూడా సెక్సీ స్టార్‌గా ముద్ర‌ప‌డిపోయింది. ఆ విధంగా ముద్ర ప‌డాల‌ని తాను అనుకోకున్నా వ‌చ్చే సినిమాల‌న్నీ అలాంటి పాత్ర‌లే రావ‌డంతో కాద‌న‌లేక ఆ పాత్ర‌లు చేసుకుంటూ వెళ్లిపోయింది. చివ‌ర‌కు ఆ పాత్ర‌లు త‌న కుటుంబాన్ని దూరం చేశాయ‌ని శ‌కీలా బాధ‌ప‌డుతోంది.

ప్ర‌స్తుతం శ‌కీలా శీల‌వ‌తి అనే సినిమా చేస్తోంది. ఈ సినిమా సంద‌ర్భంగా శ‌కీలా అన్ని చాన‌ల్స్ వాళ్లు ఇంట‌ర్వ్యూలు చేసేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా త‌న వ్య‌క్తిగ‌త విష‌యాలు పంచుకున్నారు.

అస‌లు త‌ను సినీ ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చింది కుటుంబాన్ని ఆదుకోవ‌డానికి వ‌చ్చాన‌ని చెప్పింది. ఇంటి అద్దె క‌ట్ట‌లేని ప‌రిస్థితిలో తాను సినిమా ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చాన‌ని చెప్పింది. కుటుంబం కోసం అలాంటి పాత్ర‌లు ఒప్పుకున్న‌ట్లు తెలిపింది. సమజాన్ని చెడగొట్టే పాడు సినిమాలు ఎందుకు చేశావ్? అన్న మాట అడిగితే.. నిజాయితీగా సమాధానం చెప్పేసింది. తెరపైన శ‌కీలా వేరు నిజ జీవితంలో శ‌కీలా వేరు అని ఆవేద‌న‌కు గుర‌య్యింది.

కుటుంబ క‌ష్టాల కోసం అలాంటి ప‌ని చేశాను మిన‌హా తాను వ్య‌క్తిగ‌తంగా అలాంటి విష‌యాలు న‌చ్చ‌వు అని చెబుతోంది. త‌న సంపాద‌న‌తో బాగు ప‌డిన కుటుంబాలు ఇప్పుడు త‌న‌తో ఫొటో దిగ‌డానికి ముందుకు రావ‌డం లేద‌ని వాపోయింది. త‌న క‌ష్టార్జితం అంతా వాడేసుకొని ఇప్పుడు త‌న‌ను ఒంటరి పాలు చేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -