Wednesday, May 8, 2024
- Advertisement -

వార్న‌ర్‌ను కెప్టెన్సీనుంచి తొల‌గించాలా వ‌ద్దా..? అయోమ‌యంలో స‌న్‌రైజ‌ర్స్‌..

- Advertisement -

దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో బాల్ ట్యాంపరింగ్‌ వివాదంలో ఇరుకున్న స్టీవ్ స్మిత్, బాన్‌క్రాఫ్ట్‌లపై ఐసీసీ చర్యలు తీసుకుంది. స్మిత్ మ్యాచ్ ఫీజులో పూర్తి కోత విధించడంతోపాటు ఒక టెస్టు మ్యాచ్ ఆడకుండా నిషేధం విధించింది. ఈ వివాదం కారణంగా వైస్ కెప్టెన్సీకి రాజీనామా చేసిన డేవిడ్ వార్నర్‌పై మాత్రం ఏ చర్యలు తీసుకోలేదు.

ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన క్రికెట్ ఆస్ట్రేలియా స్మిత్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించింది. ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ కూడా స్మిత్‌ను నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించింది. అతడి స్థానంలో రహానేకు కెప్టెన్ పగ్గాలు అప్పగించింది.

అయితే ఇప్పుడు డేవిడ్ వార్న‌ర్ వంతు వ‌చ్చింది. అత‌ని విష‌యంలో సన్‌రైజర్స్ ఏం చేయనుందనే ఆసక్తి రేపుతోంది. స్మిత్ బాటలోనే అతణ్ని కూడా కెప్టెన్సీ నుంచి తొలగిస్తారా..? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని ….వార్న‌ర్ విష‌యంలో క్రికెట్ ఆస్ట్రేలియా తీసుకోబోయే నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని సన్‌రైజర్స్ మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ తెలిపారు.

ఇప్పుడే అత‌ని విష‌యంలో నిర్ణ‌యం తీసుకోవ‌డం తొంద‌ర‌పాటు అవుతుంద‌న్నారు. క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం తర్వాతే తాము చర్యలు తీసుకుంటామని వీవీఎస్ తెలిపాడు. వార్నర్ తప్పిస్తే.. అతడి స్థానంలో ఎవర్ని కెప్టెన్‌గా నియమిస్తారని ప్రశ్నించగా.. ఆ దిశగా మేం ఇప్పటి దాకా ఆలోచించలేదని చెప్పాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -