Saturday, April 27, 2024
- Advertisement -

పెళ్లికి రెడీ అయిన నమిత.. అబ్బాయి ఎవరో తెలుసా..?

- Advertisement -

శరత్ బాబుతో బొద్దుగుమ్మ నమిత పెళ్లి చేసుకోబోతుందని సోషల్ మీడియాలో తెగ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే అలాంటిదేమి లేదని ఇద్దరు ఖండించారు. అంత అయిపోయింది అనుకున్న టైంలో మళ్లీ నమిత పెళ్లి అని ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ విషయం ను స్వయంగా నమిత అనౌన్స్ చేయడం విశేషం. మరింతకీ.. ఎవరా వ్యక్తి..? ఈ నెల 24 న తమిళ నటుడు వీరాతో తన పెళ్లి జరగబోతోందంటూ అనౌన్స్ చేసింది నమిత.

తమిళంలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అయిన రజియా విల్సన్ తో పాటు మరికొందరు, నమిత తో కలిసి సోషల్ మీడియాలో ఈ అనౌన్స్ మెంట్ చేశారు. నవంబర్ 24న తన ప్రేమికుడితో పెళ్లి జరగబోతోందని, ప్రేక్షకులు తమను ఎప్పుడూ ఇలాగే ఆదరించాలంటూ కోరింది నమిత. ఇంతకూ ఈ వీరా అంటే ఎవరు అనేదేగా మీ డౌట్. వీరా పెద్ద ఫ్యామస్ కాదు గానీ, సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తుంటాడు. ఇద్దరూ కలిసి మియా అనే సినిమాలో కూడా నటించారులెండి. నమితని తెలుగులో కంటే తమిళంలో ఎక్కువగా ఆదరించారు. తనను ఆదరించిన తమిళ సీమలోనే, ఫైనల్ గా నమిత సెటిల్ అవుతోందీ.

https://www.youtube.com/watch?v=ydhI-2dSSi0

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -