Thursday, May 9, 2024
- Advertisement -

అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడంపై జగన్ పై ఫిర్యాదు…

- Advertisement -

పార్టీ ఫిరాయించిన నేత‌ల‌పై అన‌ర్హ‌త వేటు వేయ‌క‌పోవ‌డంతో అసెంబ్లీ స‌మావేశాల‌ను వైసీపీ బ‌హిస్క‌రించింది. ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర చేస్తున్నారు. తాజాగా జ‌గ‌న్ షాకిచ్చింది టీడీపీ. జగన్ పై పులివెందుల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. టీడీపీ నేత రామగోపాల్ రెడ్డి ఈ ఫిర్యాదు చేశారు.

అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం ద్వారా… పులివెందుల ప్రజలను జగన్ మోసం చేశారని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. ప్రజల ఓట్లతో గెలుపొందిన జగన్, ప్రజాసమస్యలపై అసెంబ్లీలో చర్చించకుండా, అసెంబ్లీని బహిష్కరించారని అన్నారు. ఈ నేపథ్యంలో, ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 కింద జగన్ పై కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి పులివెందుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

జగన్ తీరును తప్పుబడుతున్న పార్టీలు జగన్, వైసీపీ నేతలు అసెంబ్లీకి హాజరుకాకపోవడంపై తెలుగుదేశం పార్టీ నిప్పులు చెరుగుతోంది. టీడీపీతో పాటు కాంగ్రెస్, ఇతర పార్టీలు కూడా జగన్ తీరును తప్పుబడుతున్నాయి. ప్రజా సమస్యలు వినిపించేందుకు గెలిపిస్తే బహిష్కరించడం సరికాదంటున్నారు. ఇదంతా పాద‌యాత్ర‌లో జ‌గ‌న్‌కు వ‌స్తున్న క్రేజ్‌ను చూసి త‌ట్టుకోలేకె టీడీపీ కుట్ర‌లు ప‌న్నుతోంద‌ని వైసీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -