ప్రముఖ దక్షిణాది సినీ నటి నివేదా పేతురాజ్‌కు చేదు అనుభవం ఎదురైంది. దాంతో ఆమె ఓ రెస్టారెంట్ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చెన్నైలోని ఓ ప్రముఖ రెస్టారెంట్ నుంచి ఆన్ లైన్ ద్వారా ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశారు. డెలివరీ బాయ్ తెచ్చిన ఫుడ్ పార్శిల్ తెరవగానే నివేదా పేతురాజ్ షాక్ తిన్నారు.

తను ఆర్డర్ చేసిన ఫుడ్‌లో చచ్చిన బొద్దిక వచ్చందంటూ సదరు రెస్టారెంట్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇదేం తొలిసారి కాదు గతంలో కూడా ఇలాగే జరిగింది. ఈ నేపథ్యంలో ఆహరంలో ఉన్న బొద్దింక ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆ రెస్టారెంట్ పేరు వెల్లడించింది.

ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే ఇలాంటి రెస్టారెంట్లకు భారీ జరిమానా వడ్డించాలని డిమాండ్ చేశారు. వాళ్లు సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని విమర్శించారు. ఆమె సదరు రెస్టారెంట్ పేరును ట్యాగ్ చేసిందే అంతేగాక తమ రెస్టారెంట్ల జాబితా నుంచి ఈ రెస్టారెంట్‌న తొలగించాల్సిందిగా స్విగ్గీ యాజమాన్యానికి విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం ఆమె పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అమ్మాయిలను ఏడిపిస్తున్న జబర్దస్త్ టీమ్ లీడర్.. ఎవరంటే?
ఆ అమ్మాయి గానానికి మంత్రి కేటీఆర్ ఫిదా..
‘శ్యామ్ సింగరాయ్’ లో సాయి పల్లవి పాత్రపై ఇంట్రెస్టింగ్ న్యూస్..!