Thursday, May 2, 2024
- Advertisement -

ఆ అమ్మాయి గానానికి మంత్రి కేటీఆర్ ఫిదా..

- Advertisement -

ఈ ప్రపంచంలో టాలెంట్ ఎవరి అబ్బ సొత్తు కాదు అన్న సంగతి ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు నిరూపించారు. అయితే కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఎంతో అద్భుతమైన టాలెంట్ ఉన్న వారు ఉన్నారు.. వారి టాలెంట్ ఈ మద్య కొంత మంది సోషల్ మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి తెలియజేస్తున్నారు. తాజాగా ఓ అమ్మాయి పాటకు ఫిదా అయ్యారు తెలంగాణ మంత్రి కేటీఆర్. ఆమె స్వ‌రం అద్భుత‌మంటూ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. అద్భుత‌మైన గాయ‌ని అని మెచ్చుకున్నారు.

మెద‌క్ జిల్లాలోని నారైంగి గ్రామంలో శ్రావ‌ణి అనే అమ్మాయి ‘రేలా రే రేలా రే నీళ్ల‌ల్లో నిప్ప‌లే వ‌చ్చింది నిజ‌మ‌ల్లే.. ప‌డిలేచి నిలిచే ర‌ణ‌ములో నా తెలంగాణ’ అనే పాటను ఎంతో అద్భుతంగా పాడింది. ఈ వీడియోను సరేంద్ర తిప్ప‌రాజు అనే ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేసి మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేశారు.

అంతే కాదు ఆ అమ్మాయి టాలెంట్ పదిమందికి తెలిసేలా మీరే చొరవ చూపాలని రిక్వెస్ట్ చేశారు. ఈ ట్వీట్‌పై స్పందించిన కేటీఆర్… శ్రావ‌ణిలో అద్భుత‌మైన ట్యాలెంట్ ఉందని ప్ర‌శంసించారు. మ్యూజిక్ డైరెక్ట‌ర్లు థ‌మ‌న్, దేవీ శ్రీప్ర‌సాద్‌కు కేటీఆర్ ట్యాగ్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -