Friday, April 26, 2024
- Advertisement -

‘శ్యామ్ సింగరాయ్’ లో సాయి పల్లవి పాత్రపై ఇంట్రెస్టింగ్ న్యూస్..!

- Advertisement -

ప్రస్తుత యువహీరోయిన్లలో సాయి పల్లవి రూటే వేరు. ఆమె అందరూ హీరోయిన్లలా హీరో పక్కన డ్యూయెట్ సాంగ్స్ పాడుకునే టైప్ పాత్రలు చేయదు. తన పాత్ర నచ్చి కేవలం కథాబలం ఉన్న సినిమాల్లో మాత్రమే ఆమె నటిస్తోంది. కథ నచ్చకపోతే ఎన్ని కోట్లు ఇస్తామన్నా ఆమె అంగీకరించదని టాక్. ఫిదా భారీ హిట్ అయిన తర్వాత ఆమెకు వరుసబెట్టి హీరోయిన్ గా ఛాన్స్ లు వచ్చాయి. అయితే ఆమె మాత్రం సెలెక్టెడ్ సినిమాల్లో మాత్రమే నటిస్తోంది. ప్రస్తుతం ఆమె తెలుగులో మూడు సినిమాల్లో నటిస్తోంది. నాగచైతన్య తో లవ్ స్టోరీ, రానాతో విరాటపర్వం, నానితో శ్యామ్ సింగరాయ్ లో నటిస్తోంది.

శ్యామ్ సింగరాయ్ సినిమాకు రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాలో సాయి పల్లవిది హీరోయిన్ పాత్ర అని అంతా అనుకున్నారు. అయితే ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం ఆమెది సినిమాలో హీరోయిన్ పాత్ర కాదట. ఆమెది విలన్ పాత్ర అంట. ఈ సినిమా కోసం ఎంతో మందిని పరిశీలించిన డైరెక్టర్ రాహుల్ ఈ విలన్ పాత్రలో సాయి పల్లవి అయితే బాగుంటుందని ఆమెను ఒప్పించినట్లు సమాచారం. ఈ సినిమాలో ప్రత్యేకంగా కనిపించేందుకు సాయి పల్లవి ఒక ప్రత్యేక మేనరిజం పై కసరత్తులు చేస్తోందట.

ఫిదా సినిమాలో తెలంగాణ యువతిగా కనిపించేందు కోసం ప్రత్యేకంగా ఆ యాసలో సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్న సాయి పల్లవి మంచి పేరు తెచ్చుకుంది. అలాగే శ్యామ్ సింగరాయ్ లో కూడా విలన్ పాత్రలో మెప్పించేందు కోసం కష్ట పడుతున్నట్లు సమాచారం. ఈ సినిమా ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకోగా, అతి త్వరలోనే రెండో షెడ్యూల్ కూడా ప్రారంభించనున్నారు. ప్రస్తుతం టక్ జగదీష్ సినిమాపై ఫోకస్ పెట్టిన నాని అది విడుదల అవగానే శ్యామ్ సింగరాయ్ మూవీని కంప్లీట్ చేయనున్నాడు.

Also Read

ఆ ఇద్దరు అగ్ర హీరోలూ.. అలా చేయడం ఇదే తొలిసారి..!

ఖిలాడీ.. క్లైమాక్స్​ ఫైట్ సీన్​ మామూలుగా ఉండదట..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -