Monday, April 29, 2024
- Advertisement -

మళ్లీ పెళ్లి…పుకార్లకు చెక్‌ పెట్టిన ప్రగతి!

- Advertisement -

సీనియర్ నటి ప్రగతి పెళ్లి చేసుకోబోతుందన్న వార్త టీ టౌన్‌లో హల్ చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఓ స్టార్ నిర్మాతను రెండో పెళ్లి చేసుకోబోతుందని… ఆ నిర్మాత ప్రగతిని పెళ్లి చేసుకుంటానని ప్రపోజల్ పెట్టగా వెంటనే ఓకే చెప్పిందని టాక్ నడుస్తోంది. ప్రగతి చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని, భర్తతో విడిపోగా ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

ప్రస్తుతం ప్రగతి వయస్సు 50కి దగ్గరలో ఉండగా ఆమె మళ్లీ పెళ్లి అంశం చర్చనీయాంశంగా మారింది. దీంతో వెంటనే స్పందించిన ప్రగతి ఆ పుకార్లకు చెక్ పెట్టింది. ఇలాంటి వార్తలు ప్రచారం చేసిన మీడియా సంస్థపై మండిపడింది. ఎలాంటి ఆధారం లేకుండా ఇలాంటి వార్తలను ఎలా ప్రచురిస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో అనేక సార్లు ప్రగతి పెళ్లి గురించిన ప్రస్తావన రాగా ఆమె పట్టించుకోలేదు.

కానీ తాజాగా వచ్చిన గాసిప్‌పై బాగా హార్ట్ అయిన ప్రగతి తనకు మళ్లి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని తేల్చి చెప్పింది. ప్రస్తుతం తన కొడుకుతో కలిసి చెన్నైలో ఉంటున్నారు ప్రగతి. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రగతి తన ఫిట్‌నెస్‌కు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేసి ఔరా అనిపిస్తున్న సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -