Saturday, May 4, 2024
- Advertisement -

వివాదం లో ఇరుక్కున్న రాధికా ఆప్టే

- Advertisement -

వివాదం అంటే కేర్ ఆఫ్ అడ్రస్ అని చాల కొంత మంది గురించి మాట్లాడుకుంటాము. అలాంటి వాళ్లలో రాధికా ఆప్టే ప్రథమం గా కనిపిస్తారు. ఒక వివాదం ఉంది అంటే ఆవిడ అక్కడ తప్పకుండా ఉండాల్సిందే. అయితే ఇప్పటికే అనేక విషయాల పైన ఆవిడ చాలా మాటలు మాట్లాడి వివాదం తలకెక్కించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఆవిడ పారితోషికం గురించి మాట్లాడుతూ ఇంకో వివాదం తలకి ఎక్కించుకుంది అని చెప్పుకోవచ్చు.

రాధికా ఆప్టే ప్రస్తుతం హాలీవుడ్ లో “లిబర్టీ ఏ కాల్ టు స్పై” అనే సినిమా లో పని చేస్తుంది. అయితే బాలీవుడ్ కి హాలీవుడ్ కి గల పని తీరుని కంపేర్ చేస్తూ, హాలీవుడ్ లో నటీమణులకు పారితోషికం విషయం లో ఏ మాత్రం కష్టం ఉండదు కానీ బాలీవుడ్ లో నే అది సమస్య గా ఉంది అని చెప్పింది.

ఎప్పటి లాగ బాలీవుడ్ లో ని ప్రముఖులు రాధికా చేసిన కామెంట్స్ ని ఖండిస్తున్నారు. అయితే రాధికా మాత్రం తన మాటల మీద వెనక్కి తగ్గేది లేదు అని తన అభిప్రాయానికి కట్టుబడి ఉన్నారట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -