Sunday, April 28, 2024
- Advertisement -

ఆగస్టు 15 కోసం ఎదురు చూస్తున్న సైరా టీమ్

- Advertisement -

మెగా స్టార్ చిరంజీవి ప్రధాన పాత్ర లో తెరకెక్కుతున్న చిత్రం సై రా నరసింహ రెడ్డి. ఈ సినిమా అతి త్వరలో ప్రేక్షకుల ముందు తీసుకొని రావాలి అని ప్రారంభించారు కానీ అనేక కారణాల వలన సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు కొన్ని రోజుల క్రితం సినిమా షూటింగ్ పూర్తి చేసిన చిత్ర యూనిట్ ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో బిజీ గా ఉంది. అయితే సినిమా కి సంబంధించి ఇప్పటి వరకు ఒక్క అధికారిక అప్డేట్ కూడా ఎవరికీ తెలియదు. కేవలం నటుల పుట్టిన రోజుకి విడుదల అయినా పోస్టర్స్, గత ఏడాది విడుదల చేసిన టీజర్ తప్ప సినిమా కి సంబందించిన విడుదల తేదీ కానీ, ఇంకోటి కానీ, ఏ విషయం మీద కూడా క్లారిటీ లేదు.

అయితే ఈ విషయాన్నే చిత్ర యూనిట్ దగ్గర కదిలిస్తే, చిత్ర యూనిట్ ఆగస్టు 15 వరకు ఆగమని చెప్తున్నట్లు తెలుస్తుంది.ఆగస్టు 15 అని ఒక డెడ్ లైన్ ని చిత్ర యూనిట్ పెట్టుకున్నారట. అది దాటితే ఇక సినిమా ప్రమోషన్స్ గురించిన అప్డేట్స్ ఒక ప్రవాహం లా వచ్చేస్తాయట. మరి మొట్టమొదటగా చిత్ర యూనిట్ సినిమా విడుదల తేదీ ని ప్రకటించనుంది అని తెలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -