Friday, May 3, 2024
- Advertisement -

కోచ్ రేసులో రవిశాస్త్రికి గట్టి పోటీ ఇస్తున్నది ఎవరో తెలుసా…?

- Advertisement -

టీమిండియా కొత్త కోఛ్ కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ గడువు జులై 30 తేదీతో దరఖాస్తుల ప్రక్రియ ముగుస్తుంది. ఆరుగురిని ఇంటర్వూలకు ఎంపిక చేశారు. మరోవైపు ప్రస్తుతం టీమిండియా హెడ్‌ కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి, బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌, ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌. శ్రీధర్‌, బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌లకు దరఖాస్తుతో పనిలేకుండా నేరుగా ఇంటర్వ్యూకు అర్హత కల్పించారు. రవిశాస్త్రికి పోటీగా కోఛ్ రేసులో టీమ్ మూడీ ఉన్నట్లు తెలుస్తోంది.

భారత జట్టు మాజీ మేనేజర్‌గా లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌, 2011 వరల్డ్‌క్‌పలో భారత్‌ను విశ్వ విజేతగా నిలిపిన కోచ్‌ గ్యారీ కిర్‌స్టెన్‌.. న్యూజిలాండ్‌ టీమ్‌కు సుదీర్ఘకాలం కోచ్‌గా పని చేసిన మైకేల్‌ హెసన్‌.. 2005లో కోచ్‌ పోస్టు కోసం చాపెల్‌తో పోటీపడిన టామ్‌ మూడీ తదితరులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రధానంగా రవిశాస్త్రికి సవాల్ విసురుతోది టామ్ మూడీనే నని క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు.పిల్‌దేవ్‌, గైక్వాడ్‌, శాంత రంగస్వామిలతో కూడిన కమిటీ అందరినీ ఇంటర్వ్యూ చేసి కోచ్ టీమ్‌ను ఎంపిక చేయనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -