Sunday, May 5, 2024
- Advertisement -

సదా ఛాన్సుల కోసం ఏంత పని చేసిందో చూసారా..?

- Advertisement -

జయం సినిమాతో టాలీవుడ్ లోకి పరిచయం అయింది సదా. అప్పట్లో ఈ భామ సదాఫ్ అనే పేరుని కట్ చేసి.. సదాగా పాపులర్ అయ్యింది. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాకు చెందిన ముస్లిం వైద్యుడు, బ్యాంకు ఉద్యోగినిల కుమార్తె అయిన సదా ‘జయం’ సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత కూడా పలు సినిమాలు చేసింది.

శంకర్ డైరెక్షన్ లో వచ్చిన అపరిచితుడు లో నటించి అందర్ని ఆకట్టుకుంది. ఇక అప్ కమింగ్ హీరోయిన్ల హవా పెరగడం వల్ల.. ఈ భామకి అవకాశాలు తగ్గాయి. ఆ తరువాత ఆమె నటించిన సినిమాలన్నీ ప్లాప్ కావడంతో.. ఇక బుల్లితెరపై దృష్టి పెట్టింది. కొన్ని షోలకు జడ్జిగా చేసింది. తాజాగా మరోసారి ఈ అమ్మడు వెండి తెరపై మెరవాలని చూస్తోంది. దీంతో ఒక వైపు గ్లామ‌ర్ షో చేస్తూ నిర్మాత‌, ద‌ర్శ‌కుల‌ను లైన్ లో పెట్టే ప‌నిలో పెట్టింది.. ప‌నిలో ప‌నిగా ఒక జ్యోతిష్యుడిని సంప్రదిస్తే పేరు మార్చుకోమ‌న్నాడ‌ట‌.. దీంతో ఆమె పేరును మార్చేసుకుంది. ఇప్పటి వరకు సదాఫ్, సదాగా ఉన్న తన పేరు ఇప్పుడు సధా సయ్యద్‌ గా మారినట్టు తెలిపింది.

అయితే సదా అసలు పేరు.. సదాఫ్ మహమ్మద్ సయిద్. జయం సినిమా కోసం సదా గా మార్చుకొంది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత తన పేరును మార్చుకుంది. ఇప్పటికే తన పీఆర్ లకి కి కూడా ప్రమోట్ చేయమని సదా తెలిపిందట. సినీ తారలు ఇలాంటివి బాగా నమ్ముతారు. తమన్నా కూడా తన నేమ్ లో ఒక ఆంగ్ల అక్షరాన్ని జత చేస్తే.. రకుల్ ఒక వర్డ్ ని తీసేసి చేతికి ఒక రింగ్ పెట్టుకుంది. మరి సదా పేరు మార్చుకోవడం వల్ల ఆమెకి ఏ మేరకు కలిసి వస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -