Wednesday, May 8, 2024
- Advertisement -

వ‌రుణ్ పై మండిప‌డ్డ భాజాపా …

- Advertisement -

భాజాపా ఎంపీ వ‌రుణ్ గాంధీ మ‌రో సారి వివిదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. రోహింగ్యా శ‌ర‌ణార్థుల‌కు మ‌ద్ద‌తుగా చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. దీంతో సొంత పార్టీనుంచె వ్య‌తిరేక‌త ఎదుర‌య్యింది. రేంద్రమోదీ కేబినెట్‌కు చెందిన సీనియర్‌ మంత్రి హన్సరాజ్‌ అహిర్‌ సీరియస్‌గా స్పందించారు. రోహింగ్యా శరణార్థులను బహిష్కరించే విషయంలో బీజేపీ వైఖరిని తప్పుపడుతూ వరుణ్‌ గాంధీ ‘నవ్‌భారత్‌ టైమ్స్‌’లో ఓ వ్యాసాన్ని రాశారు.

వరుణ్‌ గాంధీ వ్యాఖ్యలు దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయని హన్సరాజ్‌ స్పందించారు. రోహింగ్యాల విషయంలో కేంద్రప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరు వెళ్లడానికి వీలులేదంటూ వరుణ్‌ గాంధీని హెచ్చరించారు.రోహింగ్యా శరణార్థుల్లో కొంతమందిని పాకిస్తాన్‌ ఉగ్రవాద గ్రూప్‌లు ఎరవేస్తున్నాయని కొన్ని రోజుల క్రితమే కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ముస్లింల వల్ల జాతీయ భద్రతకు పెనుముప్పు ముంచి ఉందని కేంద్ర హోం శాఖ ఆందోళన వ్యక్తంచేసింది.

అయితే రోహింగ్యాలకు శరణార్థుల గుర్తింపు కల్పించాలంటూ, ప్రభుత్వ వైఖరికి భిన్నంగా వరుణ్‌ గాంధీ కేంద్రాన్ని కోరుతున్నారు. ఆయన రాసిన వ్యాసంలో రోహింగ్యా శరణార్థులు, విదేశీ పాలసీ, దేశీయ రాజకీయాలకు బాధితులని పేర్కొన్నారు. అంతర్జాతీయ ఒప్పందాల్లో భారత్‌ కూడా సంతకం చేసిందని, శరణార్థులకు సాయం చేసే మంచి సంప్రదాయాన్ని మనం కలిగి ఉన్నామంటూ వివరించారు. ఆర్టికల్‌ 17 ప్రకారం మానవతావాదంతో దేశం ఎవరినీ బహిష్కరించడానికి వీలులేందంటూ పేర్కొన్నారు.

దేశప్రయోజాలను దృష్టిలో పెట్టుకున్న వారెవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయరంటూ అహిర్‌ మండిపడ్డారు. రోహింగ్యాల విషయంలో కేంద్రప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరూ కూడా వెళ్లడానికి వీలులేదంటూ హెచ్చరించారు. ఆయ‌న వ్యాఖ్య‌ల‌కు మ‌ద్ద‌తుగా మ‌రో భాజాపా నేత‌కూడా వ్యాఖ్యానించారు. ఈ సమస్యను మోదీ ప్రభుత్వం చాలా సమర్థవంతంగా పరిష్కరిస్తుందని, ఎవరైనా మానవతావాదాన్ని ఎత్తిచూపాలంటే, తొలుత సమస్యను అర్థం చేసుకోవాలని వరుణ్‌ గాంధీకి సూచించారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -